RBI: రుణ గ్రహీతలకు బ్యాంకులు ముందే ఈ విషయాలు చెప్పాలి
RBI: లోన్లపై తీసుకునే వడ్డీ గురించి రుణగ్రహీతలకు ముందుగానే చెప్పాలని ఆర్‌బీఐ తెలిపింది.
RBI: రుణ గ్రహీతలకు బ్యాంకులు ముందే ఈ విషయాలు చెప్పాలి
RBI: లోన్లపై తీసుకునే వడ్డీ గురించి రుణగ్రహీతలకు ముందుగానే చెప్పాలని ఆర్‌బీఐ తెలిపింది. పర్సనల్, వెహికల్, గోల్డ్ లోన్ రుణాలకు సంబంధించి విధిస్తున్న గరిష్ట వడ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ వివరాలను చెప్పాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఎలాంటి రుణాలు తీసుకుంటున్నా మొత్తం చార్జీల వివరాలను ముందే చెప్పాలని ఆర్‌బీఐ కోరింది. ఈ వివరాలు తెలిస్తే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి లోన్ వస్తోందో తెలిసే అవకాశం ఉంటుంది.
నాన్ బ్యాంకింగ్ సంస్థల విధించే వడ్డీ రేట్లకు ఆర్‌బీఐ ఎలాంటి సీలింగ్ విధించదు. ఎన్‌బీఎప్‌సీల్లో ఒకసారి నిర్ణయించిన వడ్డీ రేట్లను పెంచాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం తప్పనిసరి. లోన్ తీసుకొనే వారి క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీరేట్లు ఉంటాయి. లోన్ వాల్యూ, రుణదాతలు లోన్ రీ పేమెంట్స్ చేసే సామర్ధ్యం, లోన్ గడువు వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని వడ్డీరేట్లు, ఛార్జీలను నిర్ణయిస్తారు.
లోన్ తీసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీ వసూలు చేస్తారు. బ్యాంకును బట్టి ఇవి మారుతుంటాయి. కొన్ని బ్యాంకులు 2 శాతం, మరికొన్ని 2.5 శాతం ఇలా వసూలు చేస్తాయి. గడువు కంటే ముందే లోన్ తీర్చాలంటే కూడా ఛార్జీ చెల్లించాలి. బ్యాంకును బట్టి ఇవి మారుతాయి. రుణం తీసుకునే సమయంలో చెప్పే వడ్డీ రేటు ప్రకారంగానే లోన్ ఇచ్చారా కూడా తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఇతరత్రా కారణాలు చెబుతూ వడ్డీరేట్లను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకున్నాకే లోన్లు తీసుకోవాలి.
బ్యాంకులు కొన్ని సమయాల్లో ఇచ్చే ఆఫర్లలో వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అయితే ఈ ఆఫర్ ను చూసి లోన్ దరఖాస్తు చేసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫర్ లో ప్రకటించిన వడ్డీ ప్రకారమే వడ్డీరేటు ఉందో లేదో చెక్ చేసుకొన్నాకే లోన్ తీసుకోవాలి.