Bank Holidays in September 2023: సెప్టెంబరులో 16 రోజుల పాటు బ్యాంకులు బంద్.. పూర్తి జాబితా ఇదే!

Bank Holidays in September 2023: RBI జారీ చేసిన సెలవు జాబితా ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శని, ఆదివారాలతో సహా 16 రోజుల పాటు మూసి ఉండనున్నాయి.

Update: 2023-08-25 12:30 GMT

Bank Holidays in September 2023: సెప్టెంబరులో 16 రోజుల పాటు బ్యాంకులు బంద్.. పూర్తి జాబితా ఇదే!

Bank Holidays in September 2023: RBI జారీ చేసిన సెలవు జాబితా ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులు నెలలో రెండవ, నాల్గవ శని, ఆదివారాలతో సహా 16 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. RBI మార్గదర్శకాల ప్రకారం, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు స్థానిక పండుగలు అలాగే జాతీయ సెలవులు,ప్రాంతీయ సెలవు దినాలలో బంద్ ఉంటాయి.

ప్రాంతీయ సెలవులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సెప్టెంబరు 6, 7 తేదీల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 28న ఈద్-ఇ-మిలాద్ వంటి జాతీయ సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కస్టమర్లు బ్యాంకు సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్‌బీఐ సూచిస్తుంది. దానికి అనుగుణంగా పూర్తి ప్రణాళికను రూపొందించుకోవాలి. అయితే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, ATM సేవలు దేశవ్యాప్తంగా పనిచేస్తాయి.

సెప్టెంబర్ నెల సెలవుల జాబితా ఇప్పుడు చూద్దాం..

3 సెప్టెంబర్ 2023: ఆదివారం

6 సెప్టెంబర్ 2023: శ్రీ కృష్ణ జన్మాష్టమి

7 సెప్టెంబర్ 2023: జన్మాష్టమి (శ్రావణ సంవత్-8), శ్రీ కృష్ణ అష్టమి

సెప్టెంబర్ 9, 2023: రెండవ శనివారం

10 సెప్టెంబర్ 2023: రెండవ ఆదివారం

17 సెప్టెంబర్ 2023: ఆదివారం

18 సెప్టెంబర్ 2023: వర్సిద్ధి వినాయక వ్రతం, వినాయక చతుర్థి

19 సెప్టెంబర్ 2023: గణేష్ చతుర్థి

20 సెప్టెంబర్ 2023: గణేష్ చతుర్థి (2వ రోజు), నుఖాయ్ (ఒడిశా)

22 సెప్టెంబర్ 2023: శ్రీ నారాయణ గురు సమాధి దివస్.

23 సెప్టెంబర్ 2023: నాల్గవ శనివారం, మహారాజా హరి సింగ్ పుట్టినరోజు.

24 సెప్టెంబర్ 2023: ఆదివారం

25 సెప్టెంబర్ 2023: శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టిన రోజు.

27 సెప్టెంబర్ 2023: మిలాద్-ఎ-షెరీఫ్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు).

28 సెప్టెంబర్ 2023: ఈద్-ఎ-మిలాద్ లేదా ఈద్-ఎ-మిలాదున్నబి (ప్రవక్త ముహమ్మద్ జన్మదినం)

29 సెప్టెంబర్ 2023: ఇంద్రజాత్ర,శుక్రవారం ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్)

ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, అన్ని ప్రభుత్వ సెలవులు కాకుండా, ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇది కాకుండా, రెండవ, నాల్గవ శనివారాలు కూడా బ్యాంకులు మూసివేయబడతాయి.

Tags:    

Similar News