Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..ఏపీ, తెలంగాణలో మూడు రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays: బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్లందరికీ అలర్ట్. బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే ఏయే తేదీల్లో సెలవు ఉందో ముందుగానే తెలుసుకోండి. లేందంటే ఎమర్జెన్సీ సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..ఏపీ, తెలంగాణలో మూడు రోజులు బ్యాంకులు బంద్
Bank Holidays: ఏపీ, తెలంగాణలోని బ్యాంకు వినియోగదారులకు ముఖ్య గమనిక. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూసిఉంటాయి. బ్యాంకులకు ఎందుకు సెలవు ఉందో తెలుసుకుందాం.
బ్యాంకులకు ప్రతినెల సెలువులోపాటు ఆదివారాలు పనిచేయవు. పండగలు లేదంటే నేషనల్ హాలీడేస్ లో తప్పనిసరిగా బంద్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా స్థానికంగా పెద్ద పండగలు, జాతరలు వంటి జరిగితే కూడా అక్కడ సెలువులు ఇస్తుంటారు. అందుకే బ్యాంకు కస్టమర్లు బ్యాంకులు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయన్న విషయం తెలసుకోవడం చాలా ముఖ్యం. ఏపీ, తెలంగాణలో వరుసగా 3 రోజులు బ్యాంకులు పనిచేయవు. దీని వల్ల బ్యాంక్ కస్టమర్లపై ఈ ప్రభావం పడుతుంది. ఏ ఏ రోజుల్లో ఇలా బ్యాంకులు వరసగా పనిచేయవో ఓసారి తెలుసుకుందాం. ఈ తేదీలు ముందే తెలుసుకుంటే దానికి అనుగుణంగా బ్యాంకు పనులు చక్కబెట్టుకోవచ్చు.
కాగా ఆగస్టు నెలలో పండగలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రదినోత్సవం రోజు బంద్ ఉంది. రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బంద్ ఉంటాయి. వీటిని కలుపుకుంటే బ్యాంకులకు చాలానే సెలవులు ఉన్నాయి. ఈ సందర్భంగా బ్యాంకులు వరుసగా 3రోజులు పనిచేయవు. ఏ ఏ తేదీల్లో బ్యాంకులు బంద్ ఉంటాయో తెలుసుకుందాం. ఆగస్టు 24న నాలుగో శనివారం వచ్చింది. ఆ రోజు బ్యాంకులకు సెలువు. ఇంకా ఆగస్టు 25వ తేదీన తర్వాత రోజు ఆదివారం ఉంటుంది. అంటే ఈ రోజు కూడా బ్యాంకులకు సెలువు ఉంది. ఇలా బ్యాంకులు వరుసగా 2రోజులు పనిచేయవు.
ఇక తర్వాత రోజు అంటే ఆగస్టు 26న కూడా బ్యాంకులకు సెలవు ఉంది. ఆగస్టు 26న క్రుష్ణాష్టమి వచ్చింది. అంటే ఆ రోజు బ్యాంకులు పనిచేయవు. ఇలా ఆగస్టు 24 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. అందువల్ల బ్యాంకులో పని ఉన్నవారు ఈ తేదీలను గుర్తుపెట్టుకుంటే మీకు సహాయపడుతుంది. ఈ తేదీలకు అనుగుణంగా బ్యాంకులు పనులు ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.