Baba Ramdev: క్రెడిట్ కార్డ్‌ని ప్రారంభించిన బాబా రామ్‌దేవ్.. 10 లక్షల వరకు పరిమితి..!

Baba Ramdev: క్రెడిట్ కార్డ్‌ని ప్రారంభించిన బాబా రామ్‌దేవ్.. 10 లక్షల వరకు పరిమితి..!

Update: 2022-03-03 16:00 GMT

Baba Ramdev: క్రెడిట్ కార్డ్‌ని ప్రారంభించిన బాబా రామ్‌దేవ్.. 10 లక్షల వరకు పరిమితి..!

Baba Ramdev: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (PAL) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లు కలిసి బ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ల రెండు వేరియంట్లని ప్రారంభించాయి. పతంజలిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ.. పతంజలి క్రెడిట్ కార్డ్ కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు.

లోకల్ నుంచి గ్లోబల్‌ వరకు ప్రయాణించడానికి ఈ కార్డు ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుందన్నారు. పతంజలి క్రెడిట్ కార్డ్ అతి త్వరలో 1 కోటి మందికి అందుబాటులో ఉంటుందన్నారు. తనని ఫాలో అవుతున్న వారి సంఖ్య దాదాపు 5 కోట్లు అని చెప్పారు. లక్షలాది మంది వివిధ ఛానెల్‌ల ద్వారా Facebook, Twitter, Instagram, YouTube ఛానెల్ మొదలైన సామాజిక సైట్‌ల ద్వారా ప్రత్యక్షంగా, తనతో కనెక్ట్ అయి ఉన్నారని అన్నారు. అందుకే ప్రపంచంలో ఎవరి వీడియోలను ఎక్కువగా వీక్షిస్తున్నారంటే అది బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ అని చెప్పగలనని తెలిపారు.

ఈ పథకం కింద కార్డుదారునికి రూ. 50,000 నుంచి రూ. 10 లక్షల వరకు క్రెడిట్ లిమిట్, రూ.10 లక్షల ప్రమాద బీమా ప్రయోజనం, పతంజలి ఉత్పత్తులపై 5 శాతం ప్రత్యేక తగ్గింపు, ఉత్పత్తులపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు లభిస్తాయని బాబా రామ్‌దేవ్ తెలిపారు. పతంజలితో అనుబంధం ఉన్న వ్యక్తులు మొదటగా ఈ క్రెడిట్ కార్డ్‌ను పొందబోతున్నారని ఆచార్య బాలకృష్ణ అన్నారు. పతంజలి అనేది కార్పొరేట్ సంస్థ కాదని, మల్టీనేషన్ కంపెనీ కాదని, వ్యాపార సంస్త కాదని, బాబా రామ్‌దేవ్ సామాజిక, ఆధ్యాత్మిక కర్తవ్యాల నెరవేర్పు కోసం ఉద్భవించిన సంకల్పమని పేర్కొన్నారు. పీఎన్‌బీతో పతంజలికి మొదటి నుంచి అనుబంధం ఉందని తెలిపారు. పతంజలి ఉద్యోగులందరినీ కో-బ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డ్‌ల సేవలకు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News