Gold Rate Today: తెలంగాణ, ఏపీ నగరాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: తెలంగాణ, ఏపీ నగరాల్లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today: మరో రెండు రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. పెళ్లిళ్లు,శుభకార్యాలు మొదలు కానున్నాయి. శుభకార్యాలు అనగానే బంగారం, వెండి గుర్తుకు వస్తుంది. బంగారు ఆభరణాలతోపాటు వెండి వస్తువులను కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అంతేకాదు ఇంకొంతమంది ఈ లోహంపై పెట్టుబడి కూడా పెడుతుంటారు. బంగారమే కాదు..వెండికి సమానంగా గిరాకీ ఉంది. అందుకే వీటి ధరలు రోజు రోజుకు మారుతుంటాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం , వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయి...తులం బంగారం ధర తగ్గిందా, పెరిగిందా తెలుసుకుందాం.
హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 71,890గా ఉండగా..వెండి కిలో ధర రూ. 85,900 పలుకుతోంది. విజయవాడలో 10గ్రాముల గోల్డ్ ధర రూ. 71,890ఉంటే...వెండి ధర రూ. 85,990గా ట్రేడ్ అవుతోంది. అటు విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర రూ. 71,890గా ఉండగా..కిలో వెండి ధర రూ. 85,900గా ఉంది.
బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ. 71,487 ఉండగా..గురువారం రూ. 403 పెరిగి రూ. 71,890కి చేరింది. బుధవారం కిలో వెండి ధర రూ. 85,300 ఉండగా..గురువారం నాటికి రూ. 690 పెరిగి రూ. 85,900కి చేరింది.