ATM Charges Hike: బిగ్ అలర్ట్..నేటి నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు.. జేబుకు భారీ చిల్లు

Update: 2025-05-01 03:00 GMT

ATM Charges Hike: ఎప్పుడూ ఛార్జీలు పెరగడం అనే మాట వింటాం కానీ..తగ్గుతాయనే మాట వినడం చాలా కష్టం. ప్రజలు ఏటీఎంకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిపిన తర్వాత సైలెంటుగా ఛార్జీ పడుతోంది. అకౌంట్ నుంచి డబ్బు బ్యాంకుకు వెళ్తోంది. మే 1 నుంచి బ్యాంకుల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెరిగాయి. దీంతో మనం ఫ్రీగా అదనపు ట్రాన్సాక్షన్స్ చేయకుండా జాగ్రత్తగాఉండాలి. చేశామంటే జేబుకు చిల్లు పడినట్లే.

ఆర్బిఐ షాకింగ్ ప్రకటన చేసింది. మే 1 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎందుకంటే ఏటీఎం నిర్వహణ ఖర్చులు పెరగడం, సెక్యూరిటీ కోసం ఖర్చులు ఎక్కువగా అయ్యాయని చెబుతోంది. కానీ ఒకప్పుడు ప్రతీ ఏటీఎంలో సెక్యూరిటీ మెన్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉండటం లేదు. అలాంటప్పుడు సెక్యూరిటీ ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో ఒకసారి ఆలోచించాల్సిందే.

ఇప్పటి వరకు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ నుంచి డబ్బు విత్ డ్రా చేస్తే దానికి రూ. 21 తీసుకోవారు. మే 1 నుంచి రూ. 23 తీసుకుంటారు. దీంతో మళ్లీ అదనంగా ట్యాక్స్ కూడా ఉంటుంది. ఇది అన్ని బ్యాంకులకూ ఒకే విధంగా లేదు. కొన్ని బ్యాంకులు అమల్లోకి తీసుకువచ్చాయి. కొన్ని ఇంకా అమలు చేయలేదు. ప్రజలకు బ్యాంకుల నుంచి ఫ్రీ సర్వీసులు తగ్గిపోయాయి. రాను రాను కమర్షియాలిటీ పెరిగిపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News