Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో పొదుపు చేస్తున్నారా.. ఈ విషయం అస్సలు మరిచిపోవద్దు..!

Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల భవిష్యత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన స్కీంని ప్రవేశపెట్టింది.

Update: 2024-01-20 11:45 GMT

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో పొదుపు చేస్తున్నారా.. ఈ విషయం అస్సలు మరిచిపోవద్దు..!

Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల భవిష్యత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన స్కీంని ప్రవేశపెట్టింది. దీనికింద పది సంవత్సరాలలోపు బాలికలకు పోస్టాఫీసులు లేదా బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్‌ చేయవచ్చు. ఇప్పటికే దేశంలో చాలామంది లక్షల ఖాతాలు ఓపెన్‌ చేశారు. ఈ పథకం లక్ష్యం బాలికలకు విద్య, వివాహం విషయాలలో సాయం చేయడం. ప్రస్తుతం ఈ స్కీంలో 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. మీరు కూడా ఈ పథకంలో పొదుపు చేస్తున్నట్లయితే ఒక విషయాన్ని అస్సలు మరిచిపోవద్దు. దీని గురించి తెలుసుకుందాం.

భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకం కింద 2.73 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్‌ చేశారు. ఈ ఖాతాలన్నింటిలో జమ అయిన మొత్తం రూ.1.19 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. పిల్లలకి 21 ఏళ్లు నిండినప్పుడు ఈ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాను ఎక్కడైనా ఏ బ్యాంకుకైనా బదిలీ చేసుకోవచ్చు.ఇప్పుడు మీరు కూడా సుకన్య సమృద్ధి యోజన కింద మీ కుమార్తె కోసం ఖాతాను తెరిచినట్లయితే అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం ముఖ్యం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది.

ప్రతి సంవత్సరం ఖాతాలో కనీసం రూ.250 పెట్టుబడి పెట్టాలి. ఇది కాకుండా గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31లోపు ఈ ఖాతాలో డబ్బు జమ చేయాలి. లేదంటే జరిమానా విధిస్తారు ఒక్కోసారి ఖాతా కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖాతాను తిరిగి ఓపెన్‌ చేయాలంటే జరిమానా చెల్లించవలసి ఉంటుంది.ఈ పథకం కింద ఎవరైనా తమ కుమార్తె పేరుపై ఖాతాను తెరవవచ్చు. అయితే 10 సంవత్సరాల వయస్సు తర్వాత ఖాతాను తెరవలేరు. పిల్లల జనన ధృవీకరణ పత్రం, మీ పత్రాలను అందించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News