Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Update: 2022-07-13 13:30 GMT

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Mutual Funds: చాలామంది ప్రజలు ఎక్కువ ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగా ఇటీవల్ మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో విపరీతంగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల నష్టాలు కూడా ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు వాటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ప్రమాదకర పెట్టుబడులు అని చెప్పవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేయడం మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు కానీ వారికి దీనివల్ల కలిగే నష్టాలు తెలియవు. అలాంటి వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం చాలా రిస్క్‌గా చెప్పవచ్చు. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌కు లింక్ అయి ఉంటాయి. వీటివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అలాగే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వీటిని పట్టించుకోకపోతే చివరికి నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. అందుకే వీటిలో పెట్టుబడి పెట్టేముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ ప్రతికూలతలు ..

1. రాబడికి హామీ ఉండదు.

2. ఇందులోని పెట్టుబడులు స్టాక్ మార్కెట్‌కు లింక్ అయి ఉంటాయి.

3. పెట్టుబడి పెట్టిన తర్వాత విత్‌ డ్రా అనేది కొంచెం కష్టమైన పని.

4. లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది.

5. వీటిపై వచ్చే రాబడిపై పన్ను విధిస్తారు.

6. నిధులపై నియంత్రణ ఉండదు.

7. ప్రత్యక్ష పెట్టుబడి వల్ల నష్టభయం ఎక్కువ.

8. స్కీం ఎంపికలో పొరపాటు చేస్తే చాలా నష్టం

Tags:    

Similar News