అనిల్ అంబానీకి లుక్‌ అవుట్‌ నోటీసు జారీ.. ఆగస్టు 5న ఈడీ విచారణకు హాజరు!

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కీలక చర్యలు తీసుకుంది. రూ.17,000 కోట్ల రుణ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్‌ అంబానీపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ చేసింది.

Update: 2025-08-01 16:38 GMT

అనిల్ అంబానీకి లుక్‌ అవుట్‌ నోటీసు జారీ.. ఆగస్టు 5న ఈడీ విచారణకు హాజరు!

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కీలక చర్యలు తీసుకుంది. రూ.17,000 కోట్ల రుణ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్‌ అంబానీపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

తాజాగా ఈడీ ముంబైలో అనిల్ అంబానీ నివాసంతో పాటు రిలయన్స్ గ్రూప్‌కు చెందిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తం 35 ప్రాంతాల్లో సోదాలు జరగగా, ఈ దర్యాప్తులో సుమారు 50 కంపెనీలు, 25 మందిపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది.

అనిల్ అంబానీని ఈ నెల ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరయ్యేలా సమన్లు జారీ చేశారు. ఈ కేసు PMLA (Prevention of Money Laundering Act) కింద నమోదు అయింది. మరిన్ని అనుబంధ సంస్థలు, డెమీ కంపెనీలు ఈ వ్యవహారంలో ఉన్నట్లు ఈడీ అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవలే ఈడీ అనిల్ అంబానీ ఇంటికి వెళ్లి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. కేసుకు సంబంధించిన మరిన్ని అంశాలు త్వరలో వెలుగు చూసే అవకాశం ఉంది.

Tags:    

Similar News