Stock markets: మరోమారు దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట
Stock markets: సెన్సెక్స్ 275 పాయింట్లు దిగజారి51,049 వద్ద ట్రేడింగ్ * నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 15,044 వద్ద ట్రేడింగ్
Representational Image
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ దేశీ మార్కెట్లు ప్రతికూల ధోరణిన ప్రారంభమై నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 250 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 15,100 పాయింట్ల దిగువకు చేరాయి. ప్రస్తుతం బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 275 పాయింట్ల మేర నష్టంతో 51,049 వద్దకు చేరగా నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 15,044 వద్ద ట్రేడవుతున్నాయి. అధిక స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం దేశీ సూచీల వరుస నష్టాలకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.