Adani: ఆ రాష్ట్రంలో రూ.2.1లక్షల కోట్ల పెట్టుబడులు.. 1.20లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్న గౌతమ్ అదానీ
Adani: రాబోయే కొద్ది రోజుల్లో అదానీ గ్రూప్ మధ్యప్రదేశ్‌లో రూ.1.10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అధికారికంగా ప్రకటించారు.
Adani : ఆ రాష్ట్రంలో రూ.2.1లక్షల కోట్ల పెట్టుబడులు.. 1.20లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్న గౌతమ్ అదానీ
Adani: రాబోయే కొద్ది రోజుల్లో అదానీ గ్రూప్ మధ్యప్రదేశ్‌లో రూ.1.10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అధికారికంగా ప్రకటించారు. గౌతమ్ అదానీ ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అదానీ గ్రూప్ మధ్యప్రదేశ్‌లో పంప్డ్ స్టోరేజ్, సిమెంట్, మైనింగ్, స్మార్ట్ మీటర్లు, థర్మల్ ఎనర్జీ రంగంలో 1.10 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతుందని, ఇది 2030 నాటికి రాష్ట్రంలో 1.20 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు.
భోపాల్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్ 'ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్' ప్రారంభోత్సవంలో గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ, ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్, రూ. 1,00,000 కోట్ల అదనపు పెట్టుబడితో బొగ్గు-గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ కోసం తమ బృందం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని అన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ ప్రయాణం ఇంకా చాలా కాలం కొనసాగుతుందని ఆయన అన్నారు. గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. “ఈ రోజు పంప్డ్ స్టోరేజ్, సిమెంట్, మైనింగ్, స్మార్ట్-మీటర్లు, థర్మల్ ఎనర్జీ రంగాలలో రూ. 1,10,000 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులను ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. ఈ బహుళ రంగాల పెట్టుబడి 2030 నాటికి మధ్యప్రదేశ్‌లో 1,20,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుంది.
మధ్యప్రదేశ్ అభివృద్ధి ఉమ్మడి ప్రయాణంలో ఈ ప్రాజెక్టులు ఒక ప్రధాన విజయంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని పారిశ్రామిక, ఆర్థిక పురోగతిలో నేషనల్ లీడర్ గా మారుస్తాయని అన్నారు. గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘‘మధ్యప్రదేశ్ అభివృద్ధిలో పెద్ద ఎత్తుకు దూసుకుపోనున్న తరుణంలో అదానీ గ్రూప్ రాష్ట్రంతో నిలబడడం గర్వంగా భావిస్తోంది. రాష్ట్రంలో ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయ-వ్యాపారాలలో మేము ఇప్పటికే రూ. 50,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాం, 25,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాం. కానీ ఇక్కడ మా ప్రయాణం ఇంకా ముగియలేదు.’’ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చిన 'మేక్ ఇన్ ఇండియా', 'డిజిటల్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ఆయన ఉదహరించారు. ఈ చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను స్వావలంబన, ఆవిష్కరణల యుగంలోకి తీసుకువచ్చాయని అన్నారు. ఈ నెల ప్రారంభంలో తన కుమారుడు జీత్ అదానీ వివాహం సందర్భంగా గౌతమ్ అదానీ విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో నిరుపేదలకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించే లక్ష్యంతో సామాజిక ప్రయోజనాల కోసం రూ. 10,000 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.