ముగిసిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం.. టాప్‌ బిడ్డర్‌గా నిలిచిన రిలయన్స్‌ జియో

5G Spectrum Auction Ends: దేశ టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యయం నమోదయ్యింది.

Update: 2022-08-01 11:59 GMT

ముగిసిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం.. టాప్‌ బిడ్డర్‌గా నిలిచిన రిలయన్స్‌ జియో

5G Spectrum Auction Ends: దేశ టెలికాం చరిత్రలో సరికొత్త అధ్యయం నమోదయ్యింది. 5జీ స్పెక్ట్రమ్‌ సరికొత్త రికార్డులను సృష్టించింది. జులై 26న మొదలైన 5జీ వేలం ప్రక్రియ సరిగ్గా వారం పాటు సాగింది. ఏకంగా లక్షా 50వేల 173 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఈ వేలంలో ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, ఐడియా-వోడాఫోన్‌, అదానీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గతేడాది నిర్వహించిన 4జీ స్పెక్ట్రమ్‌ వేలంలో 77వేల 815 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దాని కంటే ఇప్పుడు 5జీ రెట్టింపు ధరకు బిడ్లు దాఖలయ్యాయి. 2010లో నిర్వహించిన 3జీ నుంచి 50వేల 968 కోట్ల రూపాయల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఇక 4జీ కంటే 10 రెట్లు ఎక్కువ వేగవంతమైన డేటాను అందించే 5జీ వేలంలో రిలయన్స్‌ జియో టాప్‌ టెలీ కంపెనీగా నిలిచింది. ఆ తరువాత వరుసలో భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌, అదానీ కంపెనీలు నిలిచాయి.

టెలికాం రంగంలోకి కొత్తగా ప్రవేశిస్తున్న అదానీ గ్రూప్‌ 26 మెగా హెడ్జ్‌ స్పెక్ట్రమ్‌కు బిడ్‌ వేసింది. ప్రైవేటు టెలికామ్‌ నెట్‌వర్క్‌కు దీన్ని ఉపయోగించనున్నట్టు తెలిపింది. అదానీ సంస్థల అధ్వర్యంలోని పోర్టులు, ఎయిర్‌‌పోర్టుల్లో కనెక్టివిటీకి మాత్రమే దీన్ని ఉపయోగిస్తామని గతంలో తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఈ స్పెక్ట్రమ్‌ లైసెన్స్‌ల కోసం బిడ్‌ వేయడంతో టెలికాం రంగంలోకి అదానీ గ్రూపులు ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో 5జీ స్పెక్ట్రమ్‌ కోసం బిడ్‌ వేశాయి. అయితే వోడాఫోన్‌ ఐడియా మాత్రం కేవలం కొన్ని సర్కిళ్లకు మాత్రమే బిడ్‌ వేసింది. అయితే ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిందో వేలం డేటా మొత్తం సేకరించాక వెల్లడి కానున్నది.

కేంద్ర ప్రభుత్వం 10 బ్యాండ్లకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ వేలంకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే 600 మెగా హెడ్జ్‌, 800 మెగా హెడ్జ్‌, 2వేల 300 మెగా హెడ్జ్‌ బ్యాండ్‌లకు మాత్రం ఎలాంటి దరఖాస్తులు రాలేదు. మూడింట రెండు వంతులు 5జీ స్పెక్ట్రమ్‌లోని 3వేల 300 మెగా హెడ్జ్‌, 26 గిగా హెడ్జ్‌ బ్యాండ్లకు బిడ్లు వచ్చాయి. 700 మెగా హెడ్జ్‌ బ్యాండ్‌కు కూడా దరఖాస్తులు వచ్చాయి. ఈ బ్యాండ్‌కు 2016లో వేలం నిర్వహించగా అప్పట్లో ఎలాంటి దరఖాస్తులు రాలేదు. జులై 26న జరిగిన వేలం మొదటి రోజునే లక్ష 45వేల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఆ తరువాత ఆరు రోజుల్లో తక్కువగా బిడ్లు వచ్చాయి. 

Tags:    

Similar News