Aadhar Cards: షాకింగ్ న్యూస్.. 1.17 కోట్ల ఆధార్ కార్డులు రద్దు

Aadhar: ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక చర్యలు తీసుకుంటోంది.

Update: 2025-07-17 07:12 GMT

Aadhar Cards: షాకింగ్ న్యూస్.. 1.17 కోట్ల ఆధార్ కార్డులు రద్దు

Aadhar: ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక చర్యలు తీసుకుంటోంది. మరణించిన వారి ఆధార్ కార్డులను రద్దు చేయడం మొదలు పెట్టింది. ఇప్పటివరకు UIDAI 1.17 కోట్లకు పైగా 12 అంకెల ఆధార్ నంబర్‌లను డియాక్టివేట్ చేసింది. బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ సమాచారం వెల్లడైంది. ఈ చర్యలో భాగంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైన మరణాల కోసం UIDAI తన మై ఆధార్ పోర్టల్ లో కొత్త సర్వీసును ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు తమ కుటుంబ సభ్యుల మరణాలను సులభంగా తెలియజేయవచ్చు.

UIDAI, భారతదేశం రిజిస్ట్రార్ జనరల్‌ను ఆధార్ నంబర్‌లతో అనుసంధానించబడిన మరణాల రికార్డులను పంచుకోవాలని అభ్యర్థించింది. దీని ద్వారా సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)ను ఉపయోగించి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 1.55 కోట్ల మరణాల రికార్డులను సేకరించింది.

UIDAI ప్రకటనలో.. "ధృవీకరణ తర్వాత, దాదాపు 1.17 కోట్ల ఆధార్ నంబర్‌లు డీయాక్టివ్ అయ్యాయి. నాన్-సిటిజన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఇదే విధమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు 6.7 లక్షల మరణాల రికార్డులు నమోదయ్యాయి. వాటిని నిష్క్రియం చేసే పని జరుగుతోంది" అని పేర్కొంది.

కుటుంబ సభ్యుడు మరణించినట్లు తెలియజేయడానికి, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యుడు ధృవీకరించిన తర్వాత, పోర్టల్‌లో మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, మరణ నమోదు సంఖ్య, ఇతర జనాభా సంబంధిత వివరాలను ఇవ్వడం తప్పనిసరి అని UIDAI తెలిపింది. కుటుంబ సభ్యుల నుండి వచ్చిన సమాచారం సరైనది అని ధృవీకరించిన తర్వాత, మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్‌ను డియాక్టివేట్ చేసే పని జరుగుతుందని తెలిపింది.

Tags:    

Similar News