Maya S Krishnan: హాలీవుడ్ ను తన మాయలో పడేసిన మాయ ఎస్ కృష్ణన్.. ఇంతకీ ఎవరామే..?

Maya S Krishnan: మీటూ ఉద్యమం సమయంలో ఓ పేరు మార్మోగిపోయింది. ఆమెనె మాయ ఎస్ కృష్ణన్.. తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు.

Update: 2025-03-07 12:30 GMT

Maya S Krishnan: హాలీవుడ్ ను తన మాయలో పడేసిన మాయ ఎస్ కృష్ణన్.. ఇంతకీ ఎవరామే..?

Maya S Krishnan: మీటూ ఉద్యమం సమయంలో ఓ పేరు మార్మోగిపోయింది. ఆమెనె మాయ ఎస్ కృష్ణన్.. తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆ ఉద్యమంతో కాదు హాలీవుడ్ లెవల్ కు ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాస్ ఏంజెల్స్ లో అమ్మడు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఆమె 2025 ఆస్కార్ రెడ్ కార్పెట్‌కు తన యూనిక్ స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన స్టైలిస్ట్ పోషెన్ తో కలిసి పని చేయనుంది.

హాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్టర్‌గా గుర్తింపు పొందిన పోషెంకో, ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్టీవ్‌తో కలిసి మాయా ఎస్ కృష్ణన్‌ను ఓ ప్రత్యేక ఫోటోషూట్‌కు ఆహ్వానించాడు. ఈ సహకారంపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఇది మాయాకు అంతర్జాతీయంగా మరిన్ని గొప్ప అవకాశాలు అందించనుందని తెలుస్తోంది.

అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు?

మాయా త్వరలో పారిస్, లాస్ ఏంజిలెస్‌లోనూ ఆడిషన్లకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఆమె ఆ ప్రాజెక్టుల కోసం ఎంపిక అయ్యిందో లేదో అధికారికంగా తెలియరాలేదు. 2021లో ఫ్రెంచ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ (జవాన్, ఫ్యామిలీ మ్యాన్, మావీరన్ ఫేమ్ అయిన యానిక్ బెన్ దర్శకత్వంలో) చేసిన అనుభవమే దీనికి కారణమా? అనే చర్చ కూడా నడుస్తోంది.

 

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన మాయా!

మాయా ఎస్ కృష్ణన్, తెలుగు చిత్ర పరిశ్రమలోకి "ఫైటర్ రాజా" అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా, కొత్త దర్శకుడు కృష్ణ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ఈ రొమాంటిక్ కామెడీ, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో భాగమవ్వడం తనకు గర్వకారణమని, మాయా వెల్లడించారు.

 

సంగీత ప్రపంచంలోనూ తనదైన ముద్ర..

ఇప్పటికే తన సృజనాత్మకతను విభిన్న కోణాల్లో చాటుకున్న మాయా, త్వరలో స్వంత మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేయనున్నారు. తాను ఎల్లప్పుడూ కొత్తదనం కోసం ప్రయాణిస్తానని, సినిమా, సంగీతం అనే రెండు రంగాల్లోనూ సంప్రదాయాలను తలకిందులు చేసే ప్రయత్నమే తన లక్ష్యమని చెబుతున్నారు.

 

డిజిటల్ ప్రపంచంలోనూ దూసుకుపోతున్న మాయా..

మాయా నటనలోనే కాదు, యూట్యూబ్ స్కెచ్ కామెడీ ద్వారానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె సృష్టించిన "మంజుల" అనే క్యారెక్టర్ గడిచిన కొన్ని నెలల్లో వైరల్ అయింది. దీనివల్ల ఆమెకు భారీగా ఫాలోయింగ్ పెరిగి, డిజిటల్ ప్రపంచంలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా, సంగీతం, ఫ్యాషన్‌లో తనదైన ముద్ర వేసినప్పటికీ, మాయా మాత్రం రంగస్థలంంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. భారతదేశంలో ప్రముఖ థియేటర్ సంస్థలతో అనేక విజయవంతమైన ప్రదర్శనలిచ్చిన మాయా, ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత థియేటర్ గ్రూపులైన Théâtre du Soleil, Les Hommes Approximatifs వేదికలపై తన ప్రతిభను ప్రదర్శించి అంతర్జాతీయ గుర్తింపు సాధించారు.

 

కేవలం నాటకాలలో నటించడమే కాకుండా, ఈ కళను వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, మాయా "ఇలులు" అనే థియేటర్ కలెక్టివ్‌ను స్థాపించారు. "ఇలులు" అంటే "భ్రమ" అనే అర్థం, ఇది మాయా పేరుకు తగిన అర్థమనే విశేషం! అనేక మంది నాటక కళాకారులు ఆర్థిక సమస్యల కారణంగా రంగస్థలాన్ని వీడాల్సిన పరిస్థితిని మాయా గమనించారు. అందుకే, ఇలులు ద్వారా కళాకారులకు నిజమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ప్రదర్శనల ఆధారంగా గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు ఆమె కృషి చేస్తున్నారు.

"బిగ్ బాస్" గెలిచినట్లైతే థియేటర్ కోసం ఓ స్థిర ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా, అది నెరవేరలేదు. కానీ నేను దానిని ఆపలేదు. నా సొంత ప్రయత్నాలతో ఇలులు నిర్మించాను. ఇంకా పెద్ద స్థాయిలో నాటక వేదికను ఏర్పాటు చేయడం నా కల, అది త్వరలోనే సాకారం చేస్తాను" అని మాయా చెబుతున్నారు. ఒక చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ వేదికల వరకు తన ప్రతిభను చాటుకున్న మాయా, సినిమా, సంగీతం, నాటకరంగం, డిజిటల్ మీడియా—ఈ నలుగురిలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News