Tata Punch: ఆఫర్లు అదరహో.. టాటా ఈ బెస్ట్ సెల్లింగ్ కారుపై మునుపెన్నడూ లేని తగ్గింపులు..!
Tata Punch: పంచ్ టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ కార్. ఈ బెస్ట్ సెల్లింగ్ కార్ కొనడానికి టాటా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.
Tata Punch: ఆఫర్లు అదరహో.. టాటా ఈ బెస్ట్ సెల్లింగ్ కారుపై మునుపెన్నడూ లేని తగ్గింపులు..!
Tata Punch: పంచ్ టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ కార్. ఈ బెస్ట్ సెల్లింగ్ కార్ కొనడానికి టాటా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మైక్రో ఎస్‌యూవీపై ఫిబ్రవరి 2025లో మంచి తగ్గింపులను అందిస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 6 లక్షల ఎక్స్-షోరూమ్. ఇప్పుడు ఈ కారుపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
ఈ నెలలో టాటా పంచ్ కొనుగోలుపై రూ.40 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎస్‌యూవీపై వినియోగదారులకు రూ. 25,000 డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది కంపెనీ. పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంది.
టాటా పంచ్ క్యాబిన్ సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక ఏసీ వెంట్లు, ముందు వరుసలో ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి. ఈ 5 సీట్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిమీ, కారులో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. కారులో స్టాండర్డ్ డ్యూయల్-ఎయిర్‌బ్యాగ్‌లు, సెంట్రల్ లాకింగ్, ఏబీఎస్ టెక్నాలజీతో సహా అన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. తక్కువ ధరలో సురక్షితమైన ఎస్‌యూవీ కోసం చూస్తున్న వారికి పంచ్ బెస్ట్ ఆప్షన్.
టాటా పంచ్‌లో 1.2-లీటర్, 3-సిలిండర్, NA పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పవర్‌ట్రెయిన్ 87 బిహెచ్‌పి పవర్,115 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పెట్రోల్‌తో 20.09 kmpl, CNGతో 26.99 km/kgకి ఇస్తుంది.