Women’s Day 2025: మగువల స్పెషల్.. ఈ మూడు స్కూటర్లను డ్రైవ్ చేయడం చాలా సులభం..!

Women’s Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఈ రోజును ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేశారు. ఈ ప్రత్యేక సందర్భంగా మహిళల కోసం ఉత్తమంగా ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

Update: 2025-03-07 13:00 GMT

Women’s Day 2025: మగువల స్పెషల్.. ఈ మూడు స్కూటర్లను డ్రైవ్ చేయడం చాలా సులభం..!

Women’s Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఈ రోజును ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేశారు. ఈ ప్రత్యేక సందర్భంగా మహిళల కోసం ఉత్తమంగా ఉండే స్కూటర్ల గురించి తెలుసుకుందాం. ఇవి డ్రైవ్ చేయడం చాలా తేలికగా ఉండటమే కాకుండా చాలా పొదుపుగా, సౌకర్యంగా ఉంటాయి. రండి.. వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం..!

TVS Jupiter 110

 

టీవీఎస్ జూపిటర్ అమ్మాయిలు, కుటుంబాలకు ఉత్తమ ఎంపిక. ఇది దాని సెగ్మెంట్లో అత్యుత్తమంగా కనిపించే స్కూటర్. ఇందులోని ఫీచర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జూపిటర్ ఇప్పుడు మరింత స్మార్ట్, ప్రీమియమ్‌గా మారింది. సీటు కింద 33 లీటర్ల స్థలం అందుబాటులో ఉంది.

ఇది మాత్రమే కాకుండా, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను కూడా కనెక్ట్ చేయచ్చు ఈ స్కూటర్ క్లాస్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్ ఉన్నాయి. జూపిటర్ 110 స్కూటర్‌లో 113.3సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 5.9కిలోవాట్ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌ను సిటీలో చాలా సులభంగా హ్యాండిల్ చేయచ్చు. స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,700 నుండి ప్రారంభమవుతుంది.

Ather Rizta

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మీరు ఏథర్ ఎనర్జీకి చెందిన రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా కొనచ్చు. ఈ స్కూటర్ నిర్దిష్ట కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ ఏథర్ స్కూటర్‌లో 3.7కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ బ్యాటరీ 160 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని పేర్కొంది. ఈ స్కూటర్ సీటు చాలా పొడవైనది, దీని కారణంగా ఇద్దరు వ్యక్తులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. స్కూటర్ సీటు కింద 34 లీటర్ల బూట్ స్పేస్ అందించారు. రిజ్టా 7-అంగుళాల TFT స్క్రీన్‌ ఉంది. ఈ స్కూటర్ ధర రూ.1.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Hero Pleasure Plus Xtec

 

హీరో మోటోకార్ప్ ప్లెజర్ ప్లస్ Xtec స్కూటర్ అమ్మాయిలు, మహిళలకు మంచి ఎంపిక. ఈ స్కూటర్ ధర రూ.71,763 నుంచి రూ.83,813 వరకు ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీన్ని రూపొందించింది. హీరో ప్లెజర్ ఒక మంచి స్కూటర్. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. కాబట్టి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయచ్చు.

ఈ స్కూటర్‌లో 110సీసీ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 8 బిహెచ్‌పి పవర్, 8.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ని ఆపరేట్ చేయడం చాలా సులభం. దీని సీటు పొడవుగా, మృదువుగా ఉంటుంది, ఇది మీకు మెరుగైన ప్రయాణాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News