Electric Scooters: పెట్రోల్‌ స్కూటర్‌ కంటే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎందుకు బెస్ట్‌.. ఈ విషయాలు గమనించండి..!

Electric Vehicles: కొత్త బైక్‌ కొనాలన్నా స్కూటర్‌ కొనాలన్నా చాలామంది ఆలోచనలో పడుతున్నారు.

Update: 2023-08-19 04:30 GMT

Electric Scooters:పెట్రోల్‌ స్కూటర్‌ కంటే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఎందుకు బెస్ట్‌.. ఈ విషయాలు గమనించండి..!

Electric Vehicles: కొత్త బైక్‌ కొనాలన్నా స్కూటర్‌ కొనాలన్నా చాలామంది ఆలోచనలో పడుతున్నారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కొనాలా పెట్రోల్‌ వెహికిల్‌ కొనాలా అనే సందిగ్ధంలో పడుతున్నారు. కానీ పెరుగుతున్న ఇంధన ధరల వల్ల చాలామంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో పెద్ద స్క్రీన్‌లను అందిస్తున్నాయి. కానీ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే స్కూటర్‌లలో ఇప్పటికీ అనలాగ్ కన్సోల్‌ మాత్రమే వస్తున్నాయి. ఇది వేగం, ఇంధనం గురించి మాత్రమే సమాచారాన్ని అందిస్తుంది. కానీ ఎలక్ట్రిక్‌ వాహనాలు నావిగేషన్ సౌకర్యం, రియల్ టైమ్ రేంజ్, రైడ్ మోడ్ మొదలైన సమాచారాన్ని స్క్రీన్‌పైనే అందిస్తున్నాయి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌

ఎలక్ట్రిక్ స్కూటర్లు దాదాపు ఫోన్‌ల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తాయి. స్కూటర్‌లకు కొత్త ఫీచర్‌లను జోడించాలన్నా, బగ్‌లను సరిచేయాలన్నా, బ్యాటరీ మెరుగుపరచాలన్నా కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లని అందజేస్తాయి. మరోవైపు పెట్రోల్ ఇంజిన్‌లతో వచ్చే స్కూటర్‌లు ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కలిగి ఉండవు. దీనివల్ల స్కూటర్‌లో కొత్త మార్పులు ఏవి కనిపించవు.

తక్కువ కాలుష్యం

పెట్రోల్ ఇంజన్ ఉన్న స్కూటర్లు ఎక్కువ పెట్రోల్ వినియోగిస్తాయి. అంతేకాదు స్కూటర్ నడుపుతున్నప్పుడు వాటి నుంచి వెలువడే కాలుష్యం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలుష్యాన్ని విడుదల చేయవు. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అంతేకాదు ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై సబ్సిడీలు అందజేస్తున్నాయి. దీనివల్ల వీటి అమ్మకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

Tags:    

Similar News