Solar Car: ఎండతో నడిచే కార్ వచ్చేసింది.. 80 పైసల ఖర్చుతో దూసుకుపోతుంది

Update: 2025-01-19 10:43 GMT

Solar Car: దేశ కార్ల పరిశ్రమలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు ఎలక్ట్రిక్ కార్లలో కొత్తదనం కనిపిస్తోంది. ఇప్పుడు సోలార్ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో పూణేకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ వేవ్ మొబిలిటీ దేశంలోని మొట్టమొదటి సౌరశక్తితో నడిచే కారు 'వేవ్ ఇవా'ను విడుదల చేసింది. 3 మీటర్ల లోపు ఉన్న ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.25 లక్షలు మాత్రమే. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ పేర్కొంది.

Vayve EVA సోలార్ కారు డిజైన్ గురించి చెప్పాలంటే అందులో అందించిన సోలార్ ప్యానెల్ కారు సన్‌రూఫ్ స్థానంలో ఉంటుంది. 1కిమీ ప్రయాణానికి కేవలం 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ పేర్కొంది. ఇందులో ముందు భాగంలో డ్రైవర్ సీట్ ఒకటే ఉంటుంది. వెనుక భాగంలో కొంచెం వెడల్పు సీటు ఉంది. డ్రైవింగ్ సీటును 6 రకాలుగా అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవచ్చు. ఇది కాకుండా, కారులో పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది.

కారు లోపల ఏసీతో పాటు ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని పొడవు 3060mm, వెడల్పు 1150mm, ఎత్తు 1590mm, గ్రౌండ్ క్లియరెన్స్ 170mm. ఈ కారు ముందు భాగంలో కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్వె, నుకవైపు డ్యూయల్ షాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ముందు డిస్క్ బ్రేక్‌లు, వెనుక వీల్స్‌కి డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్‌తో ఈ కారు టర్నింగ్ రేడియస్ 3.9 మీటర్లు. ఈ రేర్ వీల్ డ్రైవ్ కారు గరిష్ట వేగం గంటకు 70కి.మీ.

ఈ కారులో 18Kwh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉపయోగించారు. ఇది 12kW పవర్,  40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250కిమీల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో అందించిన సోలార్ ప్యానెల్‌ను కారు సన్‌రూఫ్ స్థానంలో కనిపిస్తుంది. దీని నుండి 1Km వెళ్ళడానికి ఖర్చు 80 పైసలు. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 45 నిమిషాలు మాత్రమే పడుతుంది.

Tags:    

Similar News