Valentine Gift: మీ ప్రియురాలికి స్కూటర్ గిఫ్ట్ ఇవ్వాలని ఉందా.. అయితే ఈ మోడల్స్ మీకోసమే..!
Valentine Gift: ఫిబ్రవరి 14న లవర్స్ డే. ఈ రోజున చాలా మంది యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని చూస్తుంటారు.
Valentine Gift: మీ ప్రియురాలికి స్కూటర్ గిఫ్ట్ ఇవ్వాలని ఉందా.. అయితే ఈ మోడల్స్ మీకోసమే..!
Valentine Gift: ఫిబ్రవరి 14న లవర్స్ డే. ఈ రోజున చాలా మంది యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని చూస్తుంటారు. మీ గర్ల్‌ఫ్రెండ్‌కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తే.. ఈ సుజుకి యాక్సెస్ 125, హీరో జూమ్ 110, టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్లు బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తాయి. ఈ స్కూటర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Suzuki Access 125
ముందుగా సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ విషయానికి వస్తే.. స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.81,700. ఇందులో 125-సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 45 కెఎమ్‌పిల్ వరకు మైలేజీని ఇస్తుంది.
స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. స్కూటర్ మెటాలిక్ మాట్ స్టెల్లార్ బ్లూ, పెరల్ గ్రే వైట్‌తో సహా అనేక కలర్స్ కూడా అందుబాటులో ఉంది.
Hero Xoom 110
హీరో జూమ్ ఇండియన్ మార్కెట్లో ఫేమస్ స్కూటర్. ధర రూ.76,561 నుండి మొదలై, రూ.87,050 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఇందులో 110.9-సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది. లీటర్‌పై 53.4 కెఎమ్‌పిఎల్ మైలేజీని అందిస్తుంది.
జూమ్ 110 స్కూటర్‌లో సెమీ-డిజిటల్ కన్సోల్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, గ్లోవ్‌బాక్స్ అండ్ బూట్‌లైట్ వంటి ఫీచర్లతో వస్తుంది. భద్రత కోసం స్కూటర్లో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్ బరువు 108 కిలోలు, 5.2 లీటర్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.
TVS Zest
టీవీఎస్ స్కూటీ జెస్ట్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ధర రూ.68,249 నుండి మొదలై, రూ.71,052 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. స్కూటీ 109.7 - సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది. లీటర్‌పై 48 కెఎమ్‌పిల్ మైలేజీని ఇస్తుంది.
ఈ టీవీఎస్ స్కూటీ మాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్, మ్యాట్ రెడ్ కలర్స్‌లలో లభిస్తుంది. స్కూటీ బరువు 103 కిలోలు , ఇందులో 5-లీటర్ కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.