Upcoming SUVs: ఈ నెలలో దూసుకొస్తున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా..!

Upcoming SUVs: కొత్త కారు కొనాలనే వారికి మార్చి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనేక కొత్త కార్లు కార్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు కాస్త ఆగాల్సిందే.

Update: 2025-03-01 14:45 GMT

Upcoming SUVs: ఈ నెలలో దూసుకొస్తున్న కొత్త కార్లు.. 2025లో వీటిదే హవా..!

Upcoming SUVs: కొత్త కారు కొనాలనే వారికి మార్చి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో అనేక కొత్త కార్లు కార్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు కాస్త ఆగాల్సిందే. ఈ నెలలో ఎంజీ, వోల్వో, కియా వంటి కంపెనీలు తమ కొత్త మోడళ్లను పరిచయం చేయనున్నాయి. రాబోయే ఈ కార్ల గురించి అందుబాటులో ఉన్న వివరాలు తెలుసుకుందాం.

Volvo XC90 Facelift

వోల్వో తన కొత్త XC90 ఫేస్‌లిఫ్ట్‌ను మార్చి 4 దేశంలో విడుదల చేయనుంది. ఈ వాహనం అంచనా ధర రూ. 1.05 కోట్లు (ఎక్స్-షోరూమ్). XC90 ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని మార్పులు చేయవచ్చు. ఇందులో కొత్త బంపర్, స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టైల్‌లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే11.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే,పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను వోల్వో XC90 ఫేస్‌లిఫ్ట్‌లో చూడచ్చు.

2025 Kia EV6

కియా ఇండియా EV6 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్చిలో విడుదల చేయబోతోంది. ఈ కొత్త మోడల్‌లో అనేక కొత్త మార్పులను చూడచ్చు. ఈ కారులో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్‌లో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, అప్‌డేటెడ్ సెంటర్ కన్సోల్ ఉన్నాయి. ఈవీ6లో 84 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. ఈ బ్యాటరీ 650 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందించగలదు. ఈ కారు అంచనా ధర రూ. 63 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చు.

MG Cyberster

ఎంజీ తన మొదటి ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ సైబర్‌స్టర్‌ను ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. సైబర్‌స్టర్‌లో 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు సంభార్ సాల్ట్ లేక్ వద్ద కేవలం 3.2 సెకన్ల వ్యవధిలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకొని రికార్డు సృష్టించింది. ఈ ఈవీ 510 పిఎస్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.సైబర్‌స్టర్ అంచనా ధర రూ. 50 లక్షల ఎక్స్-షోరూమ్.

Tags:    

Similar News