Upcoming Kia Seltos Hybrid Car: బడ్జెట్ రెడీ చేస్కోండి.. హైబ్రిడ్ ఇంజన్, కొత్త డిజైన్‌తో కియా సెల్టోస్..!

Upcoming Kia Seltos Hybrid Car: కియా సెల్టోస్ భారతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీని అప్‌డేట్ చేస్తోంది.

Update: 2025-02-24 01:00 GMT

Upcoming Kia Seltos Hybrid Car: బడ్జెట్ రెడీ చేస్కోండి.. హైబ్రిడ్ ఇంజన్, కొత్త డిజైన్‌తో కియా సెల్టోస్..!

Upcoming Kia Seltos Hybrid Car:

కియా సెల్టోస్ భారతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కార్లలో ఒకటి. కంపెనీ ఇప్పుడు ఈ ఎస్‌యూవీని అప్‌డేట్ చేస్తోంది. స్టైల్, ఫీచర్స్, పవర్‌ట్రెయిన్స్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. త్వరలో కియా సెల్టోస్ బలమైన హైబ్రిడ్ ఇంజన్‌తో రొడ్లపైకి రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

కియా సెల్టోస్ హైబ్రిడ్ దేశంలో దక్షిణ కొరియా కార్ల కంపెనీ నుండి మొదటి హైబ్రిడ్ ఆఫర్ అవుతుంది. తదుపరి తరం కియా సెల్టోస్ AWD సిస్టమ్‌తో 1.6L హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పొందే అవకాశం ఉంది. కారు లోపల, బయట చాలా మార్పులు చేయవచ్చని భావిస్తున్నారు. ఎస్‌యూవీలో కొత్త సీట్ అప్హోల్స్టరీ, కొత్త స్టీరింగ్ వీల్, యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, అప్‌గ్రేడ్ చేసిన డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌లు, హెడ్‌రెస్ట్‌లతో రావచ్చు.

కొత్త తరం కియా సెల్టోస్ హైబ్రిడ్ ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం ఇంకా అందలేదు. లీక్స్ ప్రకారం.. 2026 ప్రారంభంలో దేశంతో పాటు గ్లోబల్ మార్కెట్లో ఈ కారు విడుదల అవుతుందని చెబుతున్నారు.

కియా సెల్టోస్‌లో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటుందని భావిస్తున్నారు. కారులో 1.2L, 1.5L నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. కొత్త సెల్టోస్ AWD సెటప్‌తో 141బీహెచ్‌పి, 1.6L హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మైలేజీ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా.

అయితే రాబోయే కియా సెల్టోస్ ఫీచర్లు, డిజైన్‌కు సంబంధించి ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు. కొత్త సెల్టోస్ డిజైన్ ఎక్కువగా కియా EV5 మాదిరిగానే ఉండనుంది, హెడ్‌ల్యాంప్‌లో షార్ప్ డిజైన్‌ను చూడచ్చు, దీనిలో రెండు క్లస్టర్‌లను కలుపుతూ ఎల్ఈడీ ఎలిమెంట్ కూడా చూడచ్చు.

కియా సెల్టోస్ 2019 సంవత్సరంలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కారు సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రజాదరణ పొందింది. భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, టాటా హారియర్, ఎంజీ హెక్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది.

Tags:    

Similar News