Upcoming MPVs: త్వరలో లాంచ్​ కానున్న ఫ్యామిలీ కార్స్.. కుటుంబంతో టూర్ వెళ్లేందుకు బెస్ట్​ ఆప్షన్స్..!

Upcoming MPVs: దేశంలో ఎస్‌యూవీ సెగ్మెంట్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఎమ్‌పివి సెగ్మెంట్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Update: 2025-03-18 13:00 GMT

Upcoming MPVs: త్వరలో లాంచ్​ కానున్న ఫ్యామిలీ కార్స్.. కుటుంబంతో టూర్ వెళ్లేందుకు బెస్ట్​ ఆప్షన్స్..!

Upcoming MPVs: దేశంలో ఎస్‌యూవీ సెగ్మెంట్ కార్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఎమ్‌పివి సెగ్మెంట్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 7- సీటర్ కార్లను కుటుంబ వర్గాల ప్రజలు ఎక్కువగా ఇష్డపడుతున్నారు. మారుతి ఎర్టిగా ఈ సెగ్మెంట్‌ను ఏకపక్షంగా పాలిస్తోంది. టయోటా ఇన్నోవా, రెనాల్ట్ ట్రైబర్, కియా కేరెన్స్ వంటి మోడళ్లను కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో అనేక కొత్త సరసమైన మోడళ్లను తీసుకురావడానికి చాలా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇందులో కియా, రెనాల్ట్ మోడళ్లు ఈ సంవత్సరం రోడ్లపైకి రానున్నాయి. రండి.. వీటన్నింటి గురించి తెలుసుకుందాం.

1. Kia Carens Facelift

కియా భారతీయ మార్కెట్లో క్యారెన్స్ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది వచ్చే నెలలో అంటే ఏప్రిల్ 2025లో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు. కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ అనేక సార్లు భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు. దీనికి కొత్త హెడ్‌ల్యాంప్‌లు, కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్ వంటి కొత్త డిజైన్ అందించారు. అలానే అప్‌డేటెడ్ వెనుక ప్రొఫైల్, కొత్త అల్లాయ్ వీల్స్ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఫీచర్ల పరంగా, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, లెవల్ 2 అడాస్ కూడా అందుబాటులో ఉంటాయి. 1.5-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ tGDi పెట్రోల్, 1.5-లీటర్ CDRi డీజిల్ ఇంజన్లు చూడచ్చు.

2. Kia Carens EV

కియా కేరెన్స్ ఎంపీవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా పని చేస్తోంది. కేరెన్స్ ఈవీని ఇప్పటికే టెస్టింగ్ సమయంలో గుర్తించారు. ఇది బహుశా 2025 ద్వితీయార్ధంలో అమ్మకాలను ప్రారంభించవచ్చు. ఇది కారెన్సా ఫేస్‌లిఫ్ట్‌కు సమానమైన డిజైన్‌‌‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే, కొన్ని ఎలక్ట్రిక్-నిర్దిష్ట టచ్‌లు కనిపించవచ్చు. అయితే, దీని పవర్‌ట్రెయిన్‌కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. క్రెటా ఎలక్ట్రిక్‌తో కొన్ని భాగాలను పంచుకోవచ్చు. కేరెన్స్ ఈశీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించే అవకాశం ఉంది. అదే సమయంలో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను ఇందులో చూడచ్చు.

3. Renault Triber Facelift

ఈ సంవత్సరం ట్రైబర్ ఎంపీవీకి సంబంధించిన కార్డ్‌లలో సరైన మిడ్-సైకిల్ అప్‌డేట్ ఉందని రెనాల్ట్ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం, దీని విక్రయాలు 2025 ద్వితీయార్థంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ట్రైబర్ ప్రస్తుతం రెనాల్ట్ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్. భారతదేశంలో సబ్-4-మీటర్ కాంపాక్ట్ ఎంపీవీ విభాగంలో ఉన్న ఏకైక వాహనం. ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ కొత్త లుక్‌తో వస్తుంది. కాంపాక్ట్ ఎంపీవీ ఇంటీరియర్‌లో డాష్‌బోర్డ్ లేఅవుట్‌లో మార్పులు,కొత్త అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు వంటి వాటిలో కొన్ని మార్పులు కూడా ఉంటాయి. ఇందులో 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.

Tags:    

Similar News