TVS Jupiter CNG: మీ ఫేవరేట్ స్కూటర్ సీఎన్‌జీలో రాబోతుంది.. ఫుల్ ట్యాంక్‌పై 226 కిమీ మైలేజ్

Update: 2025-02-04 15:00 GMT

TVS Jupiter CNG: మీ ఫేవరేట్ స్కూటర్ సీఎన్‌జీలో రాబోతుంది.. ఫుల్ ట్యాంక్‌పై 226 కిమీ మైలేజ్

TVS Jupiter CNG: బజాజ్ ఆటో తర్వాత, ఇప్పుడు టీవీఎస్ మొదటి CNG స్కూటర్ విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీని ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని అమర్చిన విధానం నిజంగా ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త స్కూటర్ ధర రూ. 95000 నుండి ప్రారంభమవుతుంది. జూపిటర్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,174 నుండి రూ. 99,015 వరకు ఉంది.

టీవీఎస్ కొత్త జూపిటర్ సీఎన్‌జీ 1.4 కిలోల సిఎన్‌జి ఫ్యూయల్ ట్యాంక్‌ ఉంటుంది. సీటు కింద ఉన్న బూట్-స్పేస్ ప్రాంతంలో ఈ ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్‌మెంట్ చేశారు. కంపెనీ ప్రకారం.. జూపిటర్ సేఫెస్ట్ CNG స్కూటర్.

జూపిటర్ సిఎన్‌జి ఒక కిలో సీఎన్‌జీలో 84 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్ + సీఎన్‌జీపై స్కూటర్ మైలేజ్ దాదాపు 226 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌లో OBD2B కంప్లయంట్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 5.3బిహెచ్‌పి పవర్, 9.4ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ డిజైన్ దాని పెట్రోల్ మోడల్‌ మాదిరిగానే ఉంటుంది. లాంచ్ సమయంలో మోడల్‌లో కొన్ని అప్‌డేట్‌లు చేయవచ్చని అంచనాలు చెబుతున్నాయి. కొత్త CNG స్కూటర్‌లో 2-లీటర్ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఉంది. జూపిటర్ CNG‌లో 125cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది.

CNG స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిమీ. అలానే మెటల్ బాడీ, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ క్యాప్, అన్నీటికి ఒకే లాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం బజాజ్, టీవీఎస్‌లో మాత్రమే సీఎన్‌జీ ఆప్షన్ ఉంది.

Tags:    

Similar News