2025 TVS RONIN: రోనిన్ 2025 ఎడిషన్‌.. యూత్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది..!

టీవీఎస్ మోటార్ భారత్‌లో తన ప్రీమియం బైక్ రోనిన్ 2025 ఎడిషన్‌ను విడుదల చేసింది. కొత్త ఎడిషన్‌లో కొత్త రంగులు, గ్రాఫిక్స్ కనిపిస్తాయి

Update: 2025-02-18 13:06 GMT

2025 TVS RONIN: రోనిన్ 2025 ఎడిషన్‌.. యూత్‌కి పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది..! 

2025 TVS RONIN: టీవీఎస్ మోటార్ భారత్‌లో తన ప్రీమియం బైక్ రోనిన్ 2025 ఎడిషన్‌ను విడుదల చేసింది. కొత్త ఎడిషన్‌లో కొత్త రంగులు, గ్రాఫిక్స్ కనిపిస్తాయి. ఇప్పుడు లుక్ పరంగా మరింత ప్రీమియం కనిపిస్తోంది. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో నేరుగా పోటీ పడునుంది. టీవీఎస్ రోనిన్ చాలా సౌకర్యవంతమైన రైడ్, సుదూర ప్రయాణాలకు మంచి బైక్. కొత్త మోడల్‌లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.

కొత్త టీవీఎస్ రోనిన్ 2025 ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.59 లక్షలు. మీరు ఈ బైక్‌ను గ్లేసియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్, మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో కొనవచ్చు. బైక్ డిజైన్, ఇంజన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఈ బైక్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. యువతకు ఈ బైక్ బాగా నచ్చుతుంది. ఈ బైక్‌లో T- ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, 2 రైడింగ్ మోడ్‌లు, అడ్జస్ట్ చేసే లివర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌సీడీ స్పీడోమీటర్ ఉన్నాయి.

బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో 225.9cc ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 20.4 పిఎస్ పవర్, 19.93 టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. బైక్ ఇంజన్ స్మూత్‌గా, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బాగా పనిచేస్తుంది.

టీవీఎస్ రోనిన్ నిజమైన పోటీ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌తో ఉంటుంది. హంటర్ 350 ధర రూ.1,49,900 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ డిజైన్ దాని ప్లస్ పాయింట్. హంటర్ 350లో 349cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 20.2 బీహెచ్‌పి పవర్, 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. బైక్ కర్బ్ వెయిట్ 181 కిలోలు. హంటర్ 350 అనేది పవర్ ఫుల్ బైక్. టీవీఎస్ రోనిన్ హ్యాండ్లింగ్, రైడ్ క్వాలిటీ హంటర్ కంటే మెరుగ్గా ఉంది.


Tags:    

Similar News