Toyota Mini Fortuner: స్కార్పియో, సఫారీకి పోటీగా టయోటా సంచలనం. 'మినీ ఫార్చ్యూనర్' వచ్చేస్తోంది

Toyota Mini Fortuner: టయోటా సంస్థ ఫార్చ్యూనర్ కంటే చిన్నదైన ఒక కొత్త కాంపాక్ట్ SUVని అభివృద్ధి చేస్తోంది.

Update: 2025-05-18 08:00 GMT

Toyota Mini Fortuner : స్కార్పియో, సఫారీకి పోటీగా టయోటా సంచలనం. 'మినీ ఫార్చ్యూనర్' వచ్చేస్తోంది

Toyota Mini Fortuner: టయోటా సంస్థ ఫార్చ్యూనర్ కంటే చిన్నదైన ఒక కొత్త కాంపాక్ట్ SUVని అభివృద్ధి చేస్తోంది. ఈ మోడల్‌కు టయోటా 500D అనే కోడ్‌నేమ్‌ను పెట్టారు. అంతేకాకుండా దీనిని టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ పేరు ఖరారు చేస్తారని సమాచారం. టయోటా ఈ మోడల్‌ను వచ్చే అక్టోబర్‌లో ఆవిష్కరించే అవకాశం ఉంది. జపాన్‌కు చెందిన ఒక కార్ మ్యాగజైన్ టయోటా 2025 జపాన్ మొబిలిటీ షోలో ల్యాండ్ క్రూయిజర్ FJని ఆవిష్కరిస్తుందని పేర్కొంది. ఈ షో అక్టోబర్ 29న జరగనుంది.

కాంపాక్ట్ SUVలకు పెరుగుతున్న డిమాండ్, ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు తక్కువ డిమాండ్ ఉండడం వల్ల యూత్, 4x4 వాహనాలను ఇష్టపడే వినియోగదారుల కోసం కొత్త కాంపాక్ట్ SUVలో పెట్టుబడి పెట్టాలని టయోటా నిర్ణయించింది. రాబోయే ఈ కొత్త SUV పొడవు 4,410 మిమీ, వెడల్పు 1,855 మిమీ , ఎత్తు 1,870 మిమీ వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ మోడల్ కొరొల్లా క్రాస్‌కు ఆఫ్-రోడ్-ఓరియెంటెడ్ ఆప్షన్ గా ఉంటుంది. దీనితో పాటు టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ వీల్‌బేస్ 2,580 మిమీ వరకు ఉండే అవకాశం ఉంది.

డిజైన్ ఎలా ఉండబోతోంది?

టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ టయోటా కాంపాక్ట్ క్రూయిజర్ EV కాన్సెప్ట్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ 250 (టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో) వలె ఉండవచ్చు. టయోటా నిజంగా 500D పేరులో FJని ఉపయోగిస్తే, FJ క్రూయిజర్‌లో ఉన్నట్లుగానే మందపాటి C-పిల్లర్ ఇందులో ఉంటుందని చెప్పవచ్చు.

4WD సిస్టమ్‌తో రానున్న SUV

జపాన్, ఇతర ఆసియా మార్కెట్లలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని 2TR-FE 2.7-లీటర్ పెట్రోల్, 1GD-FTV 2.8-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందించవచ్చు. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉండవచ్చు. టాప్ మోడళ్లలో 40:60 ఫ్రంట్-రియర్ టార్క్ స్ప్లిట్‌తో కూడిన ఫుల్-టైమ్ 4WD సిస్టమ్ ఉండవచ్చు. ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో ట్రాక్షన్, స్టెబిలిటీని పెంచడానికి వెనుకవైపు సెంటర్-లాకింగ్ డిఫరెన్షియల్, టోర్సెన్ లిమిటెడ్-స్లిప్ డిఫరెన్షియల్‌ను కూడా ఆశించవచ్చు.

భారతదేశంలో అడుగుపెడుతుందా?

టయోటా మొదట ల్యాండ్ క్రూయిజర్ FJని అమెరికా వంటి పాశ్చాత్య మార్కెట్లలో విడుదల చేసే అవకాశం ఉంది. అక్కడ డీజిల్ ఇంజన్‌కు బదులుగా పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించవచ్చు. టయోటా థాయ్‌లాండ్‌లోని తన బాన్ ఫో ప్లాంట్‌లో ల్యాండ్ క్రూయిజర్ FJని తయారు చేస్తుంది. భారతదేశంలో టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఫార్చ్యూనర్ కంటే దిగువన ఒక SUVని విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మోడల్ ఒక మోనోకోక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇది నిజమైతే గ్లోబల్ ల్యాండ్ క్రూయిజర్ FJ ఇండియాకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News