Honda CB300F: వామ్మో.. ఇదేం బైక్ బ్రో.. ఇట్టా ఆదేశిస్తే.. అలా చేసేస్తుందిగా.. హోండా CB300F ఫీచర్లు, ధర ఇవే..!

Honda CB300F: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (HSMI) కొత్త 2023 CB300Fలో వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించింది. అంటే మీ వాయిస్‌తో కొన్ని ఫీచర్‌లను నియంత్రించే అవకాశం ఉంది.

Update: 2023-09-12 15:30 GMT

Honda CB300F: వామ్మో.. ఇదేం బైక్ బ్రో.. ఇట్టా ఆదేశిస్తే.. అలా చేసేస్తుందిగా.. హోండా CB300F ఫీచర్లు, ధర ఇవే..!

Honda CB300F Launch: హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (HSMI) తన 2023 హోండా CB300F స్ట్రీట్ ఫైటర్‌ను పరిచయం చేసింది. దీని స్పోర్టీ లుక్ 'ఇంటర్నేషనల్ బిగ్ బైక్' డిజైన్ నుంచి తీసుకున్నారు. CB300F ధర రూ. 1.7 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది డీలక్స్ ప్రో వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. హోండా ఈ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌లో OBD-II A అమర్చారు. ఇందులో 293సీసీ, ఆయిల్ కూల్డ్, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇచ్చారు. ఈ ఇంజన్ 18 kW పవర్, 25.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది.

హార్డ్వేర్, ఫీచర్లు..

CB300Fలో బ్రేకింగ్ కోసం డ్యూయల్-డిస్క్ బ్రేక్‌లు అందించారు. ముందువైపు 276 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు 220 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్-ఛానల్ ABS ఉంది. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) కూడా బైక్‌తో అందుబాటులో ఉంది. సస్పెన్షన్ కోసం, గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్, 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్ ఉన్నాయి. CB300Fలో ఆధునిక సాంకేతికతను పొందుపరిచి, హోండా పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను అందించింది. ఇది కాకుండా, ఇది అన్ని-LED లైటింగ్ సిస్టమ్, వాయిస్ కంట్రోల్ సిస్టమ్‌తో సహా అనేక లక్షణాలను కలిగి ఉంది. ఇది స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ అనే మూడు రంగులలో ప్రవేశపెట్టారు.

SP160 మోటార్‌సైకిల్..

కంపెనీ ఇటీవల SP160 మోటార్‌సైకిల్‌ను కూడా విడుదల చేసింది. ఇది సింగిల్-డిస్క్, ట్విన్-డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 2023 హోండా SP160 రూ. 1.18 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇందులో 162.7సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ కలదు. ఇది 13.2 bhp మరియు 14.5 Nm ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలదు. దీని పొడవు 2061mm, వెడల్పు 786mm, ఎత్తు 1113mm, వీల్ బేస్ 1347mm మరియు సీట్ ఎత్తు 796mm.

Tags:    

Similar News