Tata Upcoming CNG Car: రంగంలోకి టాటా కర్వ్ CNG.. మైలేజ్ ఎంతంటే...

Tata Upcoming CNG Car: దేశంలో CNG కార్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది.

Update: 2025-02-05 11:52 GMT

Tata Upcoming CNG Car: దేశంలో CNG కార్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. కొత్త మోడల్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మారుతిలో ఎక్కువ సిఎన్‌జి మోడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత టాటా మోటార్స్ నుండి ఎక్కువగా సీఎన్జీ మోడల్స్ వచ్చాయి. తాజాగా టాటా మోటార్స్ కంపెనీ మరో వాహనాన్ని తీసుకురాబోతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. టాటా కర్వ్ కూపే CNGని ఈ సంవత్సరం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు ఫీచర్లు, ధర, తదితర వివరాలు తెలుసుకుందాం.

టాటా కర్వ్ CNGలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ దాదాపు 99 bhp పవర్, 170 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే CNG కిట్‌తో పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. Nexon CNGలో కూడా ఇదే రకమైన ఇంజన్ ఉంటుంది. టాటా కర్వ్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పాటు CNG కిట్‌తో వస్తున్న భారతదేశపు మొట్టమొదటి కూపే అవుతుంది.

టాటా కర్వ్ సిఎన్‌జిలో 30-30 రెండు CNG ట్యాంకులు ఉన్నాయి. ఒక కిలో సిఎన్‌జిలో ఈ కారు 20-22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. కారు ధర దాదాపు రూ.10 లక్షలు ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.

టాటా కర్వ్ సిఎన్‌జి డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఐసిఎన్‌జి లోగో మాత్రమే కొత్తగా ఉంటుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. కర్వ్‌లో12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 9 స్పీకర్లు, JBL వాయిస్ అసిస్ట్ సిస్టమ్ ఉంటాయి. సేఫ్టీ పరంగా.. కర్వ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్ ఉన్నాయి. క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ సాధించింది.

Tags:    

Similar News