Tata Curvv CNG: టాటా నుంచి గేమ్ ఛేంజర్.. భారతదేశపు ఫస్ట్ కూపే CNG ఇదే

Update: 2025-01-26 09:01 GMT

Tata Curvv CNG: టాటా నుంచి గేమ్ ఛేంజర్.. భారతదేశపు ఫస్ట్ కూపే CNG ఇదే

Tata Curvv CNG: మారుతీ సుజుకి తర్వాత టాటా మోటార్స్ CNG కార్లపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న రెండవ కార్ కంపెనీ. టాటా తన సిఎన్‌జి పోర్ట్‌ఫోలియోను విస్తరించడానికి సిఎన్‌జిలో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం టాటా కర్వ్ కూపేను విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ వాహనం పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం చివరి నాటికి కర్వ్ CNG వేరియంట్ కూడా విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుతం ఈ కొత్త మోడల్‌కు సంబంధించి కొంత సమాచారం లీక్ అయింది.

టాటా కర్వ్ సీఎన్‌జీలో 30-30 (60 లీటర్లు) రెండు CNG ట్యాంకులు ఉన్నాయి. CNG ట్యాంక్ తర్వాత కూడా దాని బూట్‌లో స్థలానికి కొరత ఉండదు. ఇక కారు డిజైన్ విషయానికొస్తే... iCNG లోగో కారు వెనుక చూడవచ్చు. అయితే దీని డిజైన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. దీని ధర దాదాపు రూ.10 లక్షలు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కర్వ్ సీఎన్‌జీలో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ,12.3-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఈ వాహనంలో 9 స్పీకర్లు, జేబీఎల్ వాయిస్ అసిస్ట్ సిస్టమ్ ఉంటుంది.

టాటా కర్వ్ సీఎన్‌జీలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది దాదాపు 99 బీహెచ్‌పీ పవర్, 170 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే CNG కిట్‌తో పవర్, టార్క్ అవుట్‌పుట్‌లో కొన్ని మార్పులు చేయచ్చు. ఇదే ఇంజన్ నెక్సాన్ సీఎన్‌జీలో కూడా ఉంటుంది.

ఇది టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పాటు CNG కిట్‌తో కూడిన భారతదేశపు మొట్టమొదటి కూపే CNG కారు. ఈ సీఎన్‌జిలో భద్రతా ఫీచర్లకు అసలు కొరత లేదు. క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ సాధించింది. కర్వ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈపీఎస్, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. 

Tags:    

Similar News