Tata Nano Electric: రూ.4 లక్షలకే టెస్లాకు పోటీగా ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్‌తో 150 కిలోమీటర్లు
Tata Nano Electric: పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయి. బీవైడీ, టెస్లా వంటి కార్లు ప్రపంచ మార్కెట్‌లో దూసుకుపోతుండగా టాటా, మహీంద్రా, మారుతి వంటి భారతీయ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి.
Tata Nano Electric: రూ.4 లక్షలకే టెస్లాకు పోటీగా ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్‌తో 150 కిలోమీటర్లు
Tata Nano Electric: పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మార్కెట్‌ను ఆక్రమిస్తున్నాయి. బీవైడీ, టెస్లా వంటి కార్లు ప్రపంచ మార్కెట్‌లో దూసుకుపోతుండగా టాటా, మహీంద్రా, మారుతి వంటి భారతీయ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. అయితే, వీటన్నిటి మధ్య బీవైడీ, టెస్లా, టాటా, మారుతి, మహీంద్రా కార్ల కంటే చాలా చౌకైన ఒక ఎలక్ట్రిక్ కారు ఉంది.
ఒకప్పుడు టాటా నానోనే చౌకైన కారు
ఒకప్పుడు టాటా లక్ష రూపాయలకే నానో కారును విడుదల చేసింది. ఈ కారులో నలుగురు సౌకర్యంగా కూర్చోవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల టాటా ఈ కారును ఎక్కువగా విక్రయించలేకపోయింది. చివరికి టాటా మోటార్స్ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. అయితే, నానోను ఇష్టపడేవారు ఇప్పటికీ టాటా మోటార్స్ దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేస్తుందని ఆశిస్తున్నారు.
GEM e2 స్మాల్ ఈవీ ఫీచర్లు
GEM e2 స్మాల్ ఈవీ రెండు సీట్ల కారు. ఇందులో ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. కంపెనీ చెబుతున్న ప్రకారం, GEM e2 స్మాల్ ఈవీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇక దీని గరిష్ట వేగం గంటకు 35 మైళ్లు. సేఫ్టీ, ఇతర విషయాలలో భద్రత GEM e2 స్మాల్ ఈవీ బెస్ట్ అనే చెప్పాలి.
GEM e2 స్మాల్ ఈవీ ధర
టాటా మోటార్స్ నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఇంకా విడుదల చేయనప్పటికీ, GEM e2 స్మాల్ పేరుతో ఒక చిన్న ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర 4 నుండి 4.50 లక్షల రూపాయల మధ్య ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం భారతదేశంలో విడుదల కాలేదు. కానీ త్వరలో భారతీయ రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది.