Tata Punch Flex launch: మిడిల్ క్లాస్ కోసం అదిరిపోయే కారు.. మైలేజ్ ఫుల్.. పెట్రోల్ ఖర్చు ఆదా..!
Tata Punch Flex launch: టాటా మోటార్స్ త్వరలో భారత్‌లో తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును విడుదల చేయనుంది.
Tata Punch Flex launch: టాటా మోటార్స్ త్వరలో భారత్‌లో తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును విడుదల చేయనుంది. కంపెనీ మొదట ఇథనాల్‌తో మాత్రమే పంచ్‌ను లాంచ్ చేస్తుంది. ఈ సంవత్సరం టాటా మోటార్స్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ కొత్త పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. పంచ్ 100శాతం ఇథనాల్‌తో నడుస్తుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్, వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దేశంలో టాటా మోటార్స్ మాత్రమే కాదు, ఇతర కార్ల కంపెనీలు కూడా ఇథనాల్ ఆధారిత కార్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఇది 100శాతం ఇథనాల్ (ఫ్లెక్స్ ఫ్యూయల్)తో నడుస్తుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎక్కువ పరిమాణంలో అందుబాటులో లేదు. పెట్రోల్-డీజిల్, సిఎన్‌జి వంటివి సులభంగా లభిస్తాయి. అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర.. ఇంధనం, గ్యాస్ కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇథనాల్ ప్రమాదకరమైన ప్రభావాల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. అందుకే పంచ్ 100శాతం ఫ్లెక్స్ ఇంధనంతో నడుస్తుంది. వేరియంట్‌లో లభించే 86బిహెచ్‌పి పవర్, 115ఎన్ఎమ్ టార్క్ కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో ఉంటుంది. భద్రత కోసం కారులో 2 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్‌తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటాయి. పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మైలేజ్ లీటరుకు 20 కి.మీ. ఈ కారు ధర దాదాపు రూ.10 లక్షలు ఉండచ్చు.
ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి చాలా రోజులుగా చర్చ జరిగుతుంది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్లెక్స్ ఇంధనాన్ని ఉపయోగించవచ్చు.. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది. అంతే కాకుండా శక్తి కూడా ఆదా అవుతుంది. పెట్రోల్‌తో పాటు, ఇంజిన్ ఇథనాల్ మిశ్రమంతో కూడా నడుస్తుంది. ఇథనాల్ గోధుమలు, మొక్కజొన్న, చెరకు నుండి తయారైన జీవ ఇంధనం. ఫ్లెక్స్ ఇంధనం వాడకం త్వరలో భారతదేశంలో చూడచ్చు. ప్రభుత్వం కూడా దీనిపై వేగంగా కసరత్తు చేస్తోంది. అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ 100శాతం సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.