Tata Curvv Price Cut: భారీ ఆఫర్ ప్రకటించిన టాటా.. ఈ కారుపై ఏకంగా రూ.70 వేల డిస్కౌంట్..!

Tata Curvv Price Cut: టాటా మోటార్స్ లైనప్‌లో ఏకైక కూపే స్టైల్ కర్వ్ ఎస్‌యూవీని కొనడానికి ఇదే గొప్ప అవకాశం.

Update: 2025-03-08 09:37 GMT

Tata Curvv Price Cut: టాటా మోటార్స్ లైనప్‌లో ఏకైక కూపే స్టైల్ కర్వ్ ఎస్‌యూవీని కొనడానికి ఇదే గొప్ప అవకాశం. మార్చి నెలలో కంపెనీ ఈ వాహనంపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ - టాటా కర్వ్ మూడు ఎంపికలలో అందుబాటులో ఉంది. ప్రతి నెల సగటున 4500 నుంచి 5000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. టాటా కర్వ్ ఆఫర్స్, ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

ఈ టాటా వాహనంపై గరిష్టంగా రూ.70 వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు. కర్వ్ డీజిల్-పెట్రోల్ MY2024 మోడల్‌పై రూ. 30 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. అయితే, దాని MY2025 మోడల్‌పై ప్రస్తుతం ఎలాంటి తగ్గింపు లేదు. అంతేకాకుండా టాటా కర్వ్ EV కొనుగోలుపై గరిష్టంగా రూ. 70 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అలానే రూ. 20,000 వరకు అదనపు లాయల్టీ బోనస్‌ను దక్కించుకోవచ్చు.

భారతీయ మార్కెట్లో టాటా కర్వ్ డీజిల్-పెట్రోల్ మోడల్ ధర రూ. 9.99 నుండి రూ. 17.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. కంపెనీ దీనిని స్మార్ట్, ప్యూర్ ప్లస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్ ఎస్, అకాంప్లిష్డ్ ఎస్ వంటి అలఃనేక వేరియంట్‌లలో విక్రయిస్తుంది.

టాటా కర్వ్‌లో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ GDI టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మీరు ఇంజన్, వేరియంట్ ఆధారంగా 6-స్పీడ్ మాన్యువల్ / 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) ట్రాన్స్‌మిషన్‌ చూస్తారు.

ఈ ఎస్‌యూవీలో వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరాతో 6-ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ బ్రేక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. BNCAP క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

దేశీయ మార్కెట్లో టాటా కర్వ్ ఈవీ ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. ఇందులో 45 కిలోవాట్, 55 కిలోవాట్ సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. కర్వ్ ఈవీ క్లెయిమ్ పరిధి 430-500 కిమీ మధ్య ఉంటుంది.

Tags:    

Similar News