Tata Harrier EV: ఉత్పత్తి ప్రారంభం.. డెలివరీలు జూలైలోనే! ధర ఎంతంటే?
టాటా మోటార్స్ అధికారికంగా తమ నూతన ఎలక్ట్రిక్ SUV హారియర్ EV ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది.
Tata Harrier EV: ఉత్పత్తి ప్రారంభం.. డెలివరీలు జూలైలోనే! ధర ఎంతంటే?
టాటా మోటార్స్ అధికారికంగా తమ నూతన ఎలక్ట్రిక్ SUV హారియర్ EV ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీ పుణేలోని తన ప్లాంట్‌లో ఈవీ మోడల్ ప్రొడక్షన్ మొదలైనట్లు తెలిపింది. కార్ల డెలివరీలు ఈ నెల చివర్లో అంటే 2025 జులైలోనే ప్రారంభం కానున్నాయి.
జూన్ 27న హారియర్ EV ధరలను ప్రకటించిన తర్వాత జూలై 2న టాటా బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది. ఈ కారుకు భారత NCAP 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించగా, పెద్దల భద్రతలో 32/32, పిల్లల భద్రతలో 45/49 మార్కులతో అద్భుత ప్రదర్శన ఇచ్చింది.
ఈ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది – 65 కిలోవాట్లు మరియు 75 కిలోవాట్లు. రెండు వేరియంట్‌లలో రియర్ వీల్ డ్రైవ్ (RWD) సెటప్ లభిస్తుండగా, 75 కిలోవాట్ల వేరియంట్‌లో డ్యూయల్ మోటార్‌తో ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సదుపాయమూ ఉంటుంది. ధరలు రూ. 21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్‌కి రూ. 28.99 లక్షల వరకు ఉన్నాయి.
ఈ హారియర్ EV టాటా మోటార్స్ విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో మరో కీలక అడుగు. బలమైన ప్రదర్శన, అత్యాధునిక టెక్నాలజీ, అత్యధిక భద్రతా ప్రమాణాలతో మార్కెట్‌ను ఆకర్షించనుంది.