Tata Altroz Facelift: టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. 7 లక్షల కారులో ఐ20, బాలెనోలో లేని ఫీచర్లు ఇవే..!
Tata Altroz Facelift : టాటా మోటార్స్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు అల్ట్రోజ్ (Tata Altroz) అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Tata Altroz Facelift : టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. 7 లక్షల కారులో ఐ20, బాలెనోలో లేని ఫీచర్లు ఇవే
Tata Altroz Facelift : టాటా మోటార్స్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు అల్ట్రోజ్ (Tata Altroz) అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఈ కొత్త అల్ట్రోజ్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది: స్మార్ట్ (Smart), ప్యూర్ (Pure), క్రియేటివ్ (Creative), అకంప్లిష్డ్ ఎస్ (Accomplished S). ఈ కొత్త కారు కోసం బుకింగ్‌లు జూన్ 2 నుండి ప్రారంభం కానున్నాయి.
టాటా మోటార్స్ ఎప్పుడూ భద్రతకు పెద్ద పీట వేస్తుంది. కొత్త అల్ట్రోజ్‌లో కూడా ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది తన సెగ్మెంట్‌లో అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. అల్ట్రోజ్ ఆల్ఫా ఆర్‌సీ ప్లాట్‌ఫామ్ (Alpha RC platform)పై నిర్మించబడింది. దీనికి గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీ రేటింగ్, 4-స్టార్ చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీ రేటింగ్ లభించాయి. ఇది నిజంగా అద్భుతమైన విషయం. 2025 అల్ట్రోజ్‌లో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. వీటితో పాటు, ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ కాలింగ్ (SOS Emergency Calling), ఎత్తు సర్దుబాటు చేయగల సీట్ బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), కెమెరాతో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, పిల్లల సీట్ల కోసం ఐఎస్ఓఫిక్స్ యాంకరేజ్‌లు (ISOFIX anchorages) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
లోపల అదిరిపోయే మార్పులు
కొత్త అల్ట్రోజ్ లోపలి భాగంలో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త టూ-స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ , వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ , కనెక్టెడ్ టెక్ , ఎయిర్ ప్యూరిఫైయర్, రియర్ ఏసీ వెంట్స్ , ఆటో-డిమ్మింగ్ ఇంటర్నల్ రియర్‌వ్యూ మిర్రర్ , కొత్త డిజైన్ సీట్లు ఉన్నాయి.
బయట కూడా స్టైలిష్ లుక్!
కొత్త అల్ట్రోజ్ డిజైన్‌ను టాటా మోటార్స్ మరింత మెరుగుపరిచింది. దీనికి కొత్త ఫ్రంట్ గ్రిల్, ట్విన్ పాడ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన కొత్త ఆకర్షణీయమైన ఫ్రంట్ బంపర్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా, కాంట్రాస్టింగ్ కలర్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్‌లు, డ్యూయల్-టోన్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌తో స్పోర్టీ లుక్‌ను అందించారు. కొత్త అల్ట్రోజ్‌లో ఇప్పుడు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ లేదా కంపెనీ పిలిచే 'ఇన్ఫినిటీ ల్యాంప్స్' కూడా ఉన్నాయి.
డీజిల్ తో వచ్చే ఏకైక హ్యాచ్‌బ్యాక్!
అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మూడు వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి: 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, సీఎన్‌జీ (CNG) వేరియంట్. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ సెగ్మెంట్‌లో డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ అల్ట్రోజ్ మాత్రమే. ఇది దీనికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. అయితే, టాటా అల్ట్రోజ్ రేసర్‌లో ఉన్న 118బీహెచ్‌పీ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందించకూడదని కంపెనీ నిర్ణయించుకుంది.
ఈ ధరల శ్రేణిలో, కొత్త టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ కారు మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా, మారుతి స్విఫ్ట్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. మెరుగైన సేఫ్టీ, కొత్త ఫీచర్లతో అల్ట్రోజ్ ఈ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందని ఆశిస్తున్నారు.