మారుతి బాలెనోకి గట్టిపోటి ఇవ్వనున్న టాటా కొత్త CNG కారు.. తక్కువ ధరలో 25 కి.మీ మైలేజీ..!

Tata Altroz CNG: కార్ల అమ్మకాలలో మారుతి సుజుకి అన్ని కంపెనీల కంటే ముందుంటుంది.

Update: 2023-08-17 10:15 GMT

మారుతి బాలెనోకి గట్టిపోటి ఇవ్వనున్న టాటా కొత్త CNG కారు.. తక్కువ ధరలో 25 కి.మీ మైలేజీ..!

Tata Altroz CNG: కార్ల అమ్మకాలలో మారుతి సుజుకి అన్ని కంపెనీల కంటే ముందుంటుంది. ఎందుకంటే వినియోగదారులకి కావాల్సిన అవసరాలతో కార్లని తయారుచేస్తుంది. ప్రస్తుతం మారుతి సుజుకి బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. సరసమైన ధర, స్టైలిష్ లుక్, అద్భుతమైన మైలేజీ కారణంగా దీని అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే టాటా మోటర్స్‌ కూడా గొప్ప కంపెనీ.. దీని వాహనాలు కూడా ప్రజలలో చాలా పేరు సంపాదించాయి. కొత్తగా బాలెనో ధరలో ఒక CNG కారు ప్రవేశపెట్టింది. ఇది భద్రత పరంగా 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఖరీదు కూడా పెద్దగా ఉండదు. దీని పేరు టాటా ఆల్ట్రోజ్ CNG వెర్షన్. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ ధర రూ. 7.55 లక్షల నుంచి మొదలై టాప్ మోడల్‌కు రూ.10.55 లక్షల వరకు ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

టాటా ఆల్ట్రోజ్ CNGలో1.2 లీటర్ రెవోట్రాన్ ద్వి ఇంధన ఇంజన్ కలదు. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ 88 PS పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో ఈ ఇంజన్ 73.5 PS పవర్ 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని పొందుతుంది. అంతే కాకుండా సేఫ్టీ ఫీచర్లకు లోటు ఉండదు. ఇది ఇంధన లీడ్‌లో మైక్రో స్విచ్‌ని కలిగి ఉంటుంది. CNG నింపేటప్పుడు కారు ఇగ్నిషన్‌ను ఆపివేస్తుంది. దీంతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), స్టెబిలిటీ కంట్రోల్‌తో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) కలిగి ఉంది.

టాటా ఆల్ట్రోజ్ ధరలు

Tata Altroz iCNG XE - 7.55 లక్షలు

Tata Altroz iCNG XM+ - 8.40 లక్షలు

Tata Altroz iCNG XM+ (S) - 8.85 లక్షలు

Tata Altroz iCNG XZ - 9.53 లక్షలు

Tata Altroz (ఎస్) - 10.03 లక్షలు

టాటా ఆల్ట్రోజ్ iCNG XZ+ O(S) - 10.55 లక్షలు

Tags:    

Similar News