Maruti Suzuki Swift CNG: ఫుల్ ట్యాంక్‌తో 1200 కిమీ పరుగులు.. కొత్త స్విఫ్ట్‌ని కొట్టడం కష్టమే

Update: 2025-01-20 12:57 GMT

Maruti Suzuki Swift CNG: ఫుల్ ట్యాంక్‌తో 1200 కిమీ పరుగులు.. కొత్త స్విఫ్ట్‌ని కొట్టడం కష్టమే

Maruti Suzuki Swift CNG: భారతీయ మార్కెట్‌లో బడ్జెట్ ధరలో అధిక మైలేజీని ఇచ్చే కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి స్విఫ్ట్ కొన్నేళ్లుగా సంచలనం సృష్టిస్తున్న కారు. మారుతి గత సంవత్సరం స్విఫ్ట్‌ను అప్‌డేట్ చేసి కొత్త అవతార్‌లో ప్రవేశపెట్టింది. కొత్త మారుతి స్విఫ్ట్ ఇప్పుడు మరింత ఫీచర్ లోడ్ కారుగా మారింది. ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, సీఎన్‌జీ రెండు ఆప్షన్లలో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.49 లక్షలు ఎక్స్-షోరూమ్. దీని ఫీచర్లు, మైలేజీ, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్‌లో మారుతి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షల నుండి రూ. 9.59 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.  దాని CNG వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.19 లక్షలు ఎక్స్-షోరూమ్. ఈ హ్యాచ్‌బ్యాక్ LXI, VXI, VXI (O), ZXI, ZXI Plus వంటి వేరియంట్‌లలో వస్తుంది.

ఈ ఫేమస్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ Z-సిరీస్ పెట్రోల్, CNG ఇంజన్‌లను పొందుతుంది. పెట్రోల్‌లో ఈ ఇంజన్ 81.58 పీఎస్ పవర్, 111.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. అదే సమయంలో CNGతో ఇది 69.75 పీఎస్ పవర్, 101.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి స్విఫ్ట్‌లో 5-స్పీడ్ MT,  5-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి. దీని పెట్రోల్ వేరియంట్ 25.75 KMPL వరకు మైలేజీని ఇవ్వగలదు. అలానే CNG వేరియంట్ 32.85km/kg వరకు మైలేజీని ఇస్తుంది. కొత్త స్విఫ్ట్‌లో 37 లీటర్ పెట్రోల్ ట్యాంక్, 8 కిలోల కెపాసిటీ గల సిఎన్‌జి ట్యాంక్ ఉన్నాయి. ఈ రెండిటిని ఫిల్ చేయడం ద్వారా మీరు దాదాపు 1200KM వరకు ప్రయాణించవచ్చు.

సేఫ్టీ కోసం దీనిలో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 3-పాయింట్ సీట్‌బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 

సిజ్లింగ్ రెడ్, నావెల్ ఆరెంజ్, పెరల్ ఆర్కిటిక్ వైట్ వంటి వివిధ ఆకర్షణీయమైన కలర్స్‌లో ఈ కారును ఇంటికి తీసుకెళ్లచ్చు. ఇది మార్కెట్లో టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌తో పోటీపడుతుంది. కొత్త టాటా టియాగో ధరలు రూ. 4.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతాయి.

Tags:    

Similar News