Skoda Kylaq Waiting Period: స్కోడా కొత్త బడ్జెట్ కార్.. ఇంటికి రావాలంటే 4 నెలలు ఆగాల్సిందే..!
Skoda Kylaq Waiting Period: ఇండియన్ ఆటో మార్కెట్లో స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్‌ని విడుదల చేసింది.
Skoda Kylaq Waiting Period: స్కోడా కొత్త బడ్జెట్ కార్.. ఇంటికి రావాలంటే 4 నెలలు ఆగాల్సిందే..!
Skoda Kylaq Waiting Period: ఇండియన్ ఆటో మార్కెట్లో స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్‌ని విడుదల చేసింది. కైలాక్ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ ధర రూ.7.89 లక్షల ఎక్స్-షోరూమ్.కంపెనీ ఈ కారును QB-A0-IN ప్లాట్‌ఫామ్‌పై తయారుచేసింది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కుషాక్, స్లావియా వంటి ఫేమస్ మోడళ్లను తీసుకొచ్చింది.అయితే కైలాక్ బుకింగ్స్ కంపెనీ ఊహించని రేంజ్‌లో జరిగాయి. దీంతో వెయిటింగ్ పీరియడ్ 4 నెలలకు చేరుకుంది. ఈ ఏడాది మే నాటికి మొదటి దశలో 33,000 యూనిట్ల కైలాక్‌ను పంపిణీ చేయాలని కంపెనీ నిర్ణయించింది.
స్కొడా కొత్త కారు కోసం ఎలాంటి టెన్షన్ లేకుండా వెయిట్ చేయచ్చని, వీలైనంత త్వరగా డెలివరీ చేస్తామని కంపెనీ చెబుతుంది.సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కైలాక్ అత్యంత చౌకైన కారు అని స్కోడా పేర్కొంది. స్కోడా కస్టమర్లకు 5 సంవత్సరాల పాటు ప్రతి కిమీకి రూ. 0.24 ఖర్చవుతుందని తెలిపింది.అలానే మొదటి 33,000 మంది కస్టమర్లకు 3 సంవత్సరాల వరకు ఉచిత సర్వీస్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
స్కోడా కైలాక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్, మహీంద్రా XUV3XO, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది. ఈ Sస్కోడా కైలాక్ ఎస్‌యూవీలో 446 లీటర్ల కెపాసిటీ కలిగిన బూట్ స్పేస్ ఉంది. ఈ ఎస్‌యూవీ సీట్లు మడతపెట్టినట్లయితే బూట్ స్పేస్‌ను 1,265 లీటర్లకు విస్తరించవచ్చు. కొత్త స్కోడా కైలాక్ ఎస్‌యూవీ 'మోడరన్ సాలిడ్' డిజైన్‌తో కనిపిస్తుంది. కైలాక్ క్లీన్ లైన్‌లతో ఫ్రంట్ ల్యాంప్‌లతో కుషాక్ లాగా ఉంటుంది. ఎస్‌యూవీలో ట్రెండింగ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో ఎల్‌ఈడీ డీఆర్ఎల్, అప్ టాప్ ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి. కారు ముందు భాగంలో అల్యూమినియం లుక్ స్పాయిలర్‌తో డబుల్ టోన్ బంపర్ ఉంది.
ఈ కొత్త కైలాక్ ఎస్‌యూవీ లోపలి భాగంలో రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, 8-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌గ్రేడ్ OS, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో 10-అంగుళాల టచ్‌స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ ఉన్నాయి. అంతేకాకుడా కైలాక్‌లో డ్రైవర్‌కే కాకుండా ముందు ప్రయాణీకులకు కూడా ఫార్వర్డ్ సీట్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. ఎస్‌యూవీ సేఫ్టీ విషయానికి వస్తే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, చైల్డ్ సీట్ మౌంట్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉంటాయి. స్కోడా కైలాక్.. కుషాక్, స్లావియా ఎస్‌యూవీలలో ఉపయోగించిన అదే 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది.