Skoda Kylaq: స్కోడా కైలాక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే..!

Skoda Kylaq: స్కోడా తన ఏకైక సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్‌ను గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసింది.

Update: 2025-02-24 15:11 GMT

Skoda Kylaq: స్కోడా కైలాక్ వచ్చేస్తోంది.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే..!

Skoda Kylaq: స్కోడా తన ఏకైక సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్‌ను గతేడాది చివర్లో భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్‌లో స్కోడా కైలాక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.7.89 లక్షలు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. స్కోడా కైలాక్ ఇప్పుడు షోరూమ్‌లకు చేరుకుంటుంది. స్కోడా కైలాక్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధరను ఒకసారి చూద్దాం.

డిజైన్ విషయానికి వస్తే.. స్కోడా కైలాక్ క్లాసిక్ బేస్ వేరియంట్‌లో బాడీ కలర్ ఓఆర్‌వీఎమ్, డోర్ హ్యాండిల్స్, ఓఆర్‌వీఎమ్‌లపై ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16-అంగుళాల స్టీల్ వీల్స్ కోసం వీల్ కవర్స్, బ్లాక్-అవుట్ బీ పిల్లర్, మరిన్నో ఉన్నాయి.

అలానే కారు క్యాబిన్‌లో ఎత్తు అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్‌రెస్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.అంతే కాకుండా ఎస్‌యూవీలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ ఏసీ కూడా అందించారు. ఎస్‌యూవీ సేఫ్టీ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది.

స్కోడా కైలాక్ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్‌లో 1.0L 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 114 బిహెచ్‌పి పవర్, 178ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు ఇంజన్ 6-స్పీడ్ MT లేదా AT గేర్‌బాక్స్‌తో ఉంటుంది.

Tags:    

Similar News