Royal Enfield First EV Fly Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ ఈవీ.. ఫోటోస్ లీక్.. ఇదే అసలుసిసలైన ఎలక్ట్రిక్ బైక్ అంటే..!

Royal Enfield First EV Fly Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ తన ఫ్లయింగ్ ఫ్లీ C6 ను 2024 EICMA మిలన్ షోలో ప్రవేశపెట్టింది. దాని స్క్రాంబ్లర్ వేరియంట్‌ను కూడా టీజ్ చేశారు. చెన్నైకి చెందిన ఈ బ్రాండ్ ఇప్పటికే భారతదేశం అంతటా FF-C6ని విడుదల చేయడం ప్రారంభించింది. రెట్రో మోటార్‌సైకిల్ కంపెనీ మొట్టమొదటి EV ప్రత్యేకమైన స్పై షాట్స్ కూడా లీక్ అయ్యాయి. దీంతో ఎన్ఫీల్ట్ ఫస్ట్ ఈవీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.

Update: 2025-04-28 08:55 GMT

Royal Enfield First EV Fly Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ ఈవీ.. ఫోటోస్ లీక్.. ఇదే అసలుసిసలైన ఎలక్ట్రిక్ బైక్ అంటే..!

ఈ కంపెనీ 2026 మొదటి నెలలో దాని ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. టెస్ట్ మ్యూల్ ఇందులో పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్లు ఉన్నాయని వెల్లడించింది. FF-C6 సిటీలో ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. రెట్రో-మోడరన్ విధానాన్ని కలిగి ఉన్న స్లిమ్ C6, యుద్ధానికి ముందు మోటార్ సైకిల్ ఇంజనీరింగ్ నుండి ప్రేరణ పొందిన అల్యూమినియం గిర్డర్-రేంజ్ ఫ్రంట్ ఫోర్క్‌ ఉంది. ఈ స్టక్చరల్ ఎలిమెంట్‌ను ఆర్టిక్యులేటింగ్ ఫ్రంట్ మడ్‌గార్డ్‌తో కలిపి, 1940ల నాటి ఫ్లయింగ్ ఫ్లీతో డిజైన్ స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంతకుముందు ఫ్లయింగ్ ఫ్లీ బైక్‌ అల్యూమినియం ఫ్రేమ్‌పై తయారుచేస్తున్నామని, మెగ్నీషియం బ్యాటరీ హౌసింగ్‌ను ఉపయోగిస్తున్నామని ధృవీకరించింది. బ్యాటరీ కేసింగ్ షేప్ ముందు, వెనుక రెక్కల ఆకారంలో ఉంటుంది. క్లాసిక్ సిల్హౌట్‌ కోసం రౌండ్ డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ ద్వారా కీలెస్ ఇగ్నిషన్, OTA ఫర్మ్‌వేర్ అప్‌గ్రేడ్ ప్రామాణికంగా ఉంటుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే గుర్తించింది, అయితే కస్టమ్ చిప్ VCU (వెహికల్ కంట్రోల్ యూనిట్) ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకారం, ఇది రైడర్ ఇన్‌పుట్‌ల ఆధారంగా రెండు లక్షలకు పైగా రైడ్ సెట్టింగ్‌ల కలయికలను ఆర్కెస్ట్రేట్ చేస్తుంది, యాక్సిలరేషన్, బ్రేకింగ్,రీప్రొడక్షన్ ఫీడ్‌బ్యాక్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది.

Tags:    

Similar News