Electric Scooters: కొత్త తరహా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 2 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే, ఛార్జింగ్ సమయం, ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి.
Electric Scooters: కొత్త తరహా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 2 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే, ఛార్జింగ్ సమయం, ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు భారతదేశంలో స్వ్యాపబుల్ (Swapable) బ్యాటరీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లోకి అడుగుపెట్టాయి. వీటిని ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, బ్యాటరీ స్వాప్ స్టేషన్‌కు వెళ్లి, నిమిషాల్లో ఖాళీ బ్యాటరీని తీసి, పూర్తిగా ఛార్జ్ చేసిన కొత్త బ్యాటరీని అమర్చుకోవచ్చు. ఇది ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. లాంగ్ డ్రైవ్‌లకు, ముఖ్యంగా డెలివరీ సేవలందించే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో త్వరలో రానున్న లేదా ఇప్పటికే అందుబాటులో ఉన్న 5 స్వ్యాపబుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
స్వ్యాపబుల్ బ్యాటరీ అంటే ఏమిటి?
సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీని స్కూటర్ నుంచే నేరుగా ఛార్జ్ చేయాలి. దీనికి 4-5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ స్వ్యాపబుల్ బ్యాటరీ అంటే, స్కూటర్‌లోని బ్యాటరీని సులభంగా తీసి, దాని స్థానంలో పూర్తిగా ఛార్జ్ చేసిన మరొక బ్యాటరీని అమర్చుకోవచ్చు. ఈ ప్రక్రియ కేవలం 2-5 నిమిషాల్లో పూర్తవుతుంది. దీనివల్ల ఛార్జింగ్ కోసం గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్యాటరీ అయిపోగానే మార్చుకొని ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. డెలివరీ పర్సనల్, లాంగ్ డిస్టెన్స్ రైడర్స్ వంటి వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. స్వాప్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే, ఇళ్ల వద్ద ఛార్జింగ్ సమస్య ఉండదు.
భారత్‌లో అందుబాటులోకి రానున్న 5 స్వ్యాపబుల్ బ్యాటరీ స్కూటర్లు
హోండా యాక్టివా-ఇ (Honda Activa-e):
ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో హోండా కూడా అడుగుపెట్టింది. యాక్టివా-ఇ స్వ్యాపబుల్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది స్టాండర్డ్, రోడ్‌సింక్ డ్యూయో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.1,17,000 నుండి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్‌లో 6 కిలోవాట్ల మోటార్, స్మూత్ యాక్సిలరేషన్, గంటకు 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉన్నాయి.
బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity):
బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌లో 2 kWh, 48V 39 Ah స్వ్యాపబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది హబ్ మోటార్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇన్ఫినిటీలో IP67-రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 4-5 గంటల్లో ఛార్జ్ అవుతుంది మరియు 85 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎకో, స్పోర్ట్ అనే రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి.
హీరో ఆప్టిమా సిఎక్స్ (Hero Optima CX):
హీరో ఎలక్ట్రిక్ నుండి ఆప్టిమా CX స్కూటర్ 550W BLDC మోటారుతో వస్తుంది, ఇది 1.2bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిని 52.2V, 30Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో జత చేశారు. స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. 140 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. హీరో ఆప్టిమా CX గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు.
సింపుల్ ఎనర్జీ వన్ (Simple Energy One):
బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ నుండి వచ్చిన 'వన్' అనే ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల భారీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ 2.7 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.
ఒకినావా ఐ-ప్రైజ్ ప్లస్ (Okinawa i-Praise Plus):
ఒకినావా ఐ-ప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.3 kWh లిథియం-అయాన్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 139 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీని మైక్రో-ఛార్జర్, ఆటో-కట్ ఫీచర్‌తో 4-5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌కు 3 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు (ఏది ముందు అయితే అది) ఎలక్ట్రిక్ మోటారు వారంటీతో లభిస్తుంది.