New Bajaj Chetak Urbane: కొత్త బజాజ్ చేతక్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
New Bajaj Chetak Urbane: బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లోకి కొత్త 2024 చేతక్ అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
New Bajaj Chetak Urbane: కొత్త బజాజ్ చేతక్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
New Bajaj Chetak Urbane: బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లోకి కొత్త 2024 చేతక్ అర్బన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది దాని మునుపటి వెర్షన్ కంటే మరింత కొత్తగా ఉంది. కస్టమర్లను ఆకర్షించడానికి 2024 బజాజ్ చేతక్ EVలో చాలా అప్‌డేట్‌లు అందించారు. బజాజ్ అధికారికంగా తన వెబ్‌సైట్‌లో రూ. 1,15,001 ధర ట్యాగ్‌తో కొత్త చేతక్ అర్బన్‌ను జాబితా సిద్దం చేసింది. అయితే 2023 చేతక్ ప్రీమియం ధర రూ. 1,15,000గా ఉంది.
కొత్త ఫీచర్లు
లుక్స్ పరంగా 2024 బజాజ్ చేతక్ అర్బన్ స్టైలిష్‌గా ఉంది. దీని ముందు భాగంలో వృత్తాకార LED హెడ్‌లైట్ ఉంది. బాడీ ప్యానెల్స్, లెవెల్ ఫ్లోర్‌బోర్డ్, ఇంటిగ్రేటెడ్ సీట్లు వంటి రెట్రో డిజైన్ అంశాలు అలాగే ఉంచారు. ఇది టెక్‌పాక్‌తో అందించారు. హిల్-హోల్డ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ప్యాకేజీ, రివర్స్ మోడ్ ఉన్నాయి. ఈ కనెక్టివిటీ సూట్‌లో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు, ట్యాంపర్ హెచ్చరికలు ఉన్నాయి.
2.9 kWh బ్యాటరీ ప్యాక్, గరిష్ట వేగం పెరిగింది
TecPac చేతక్ అర్బన్ గరిష్ట వేగాన్ని 73 kmphకి పెంచారు. ఇది స్టాండర్డ్ వెర్షన్ 63 kmph టాప్ స్పీడ్ కంటే ఎక్కువ. 2024 బజాజ్ చేతక్ ఇ-స్కూటర్ 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 113 కిమీల పరిధిని ఇవ్వగలదు. ఛార్జింగ్ దాదాపు 4 గంటల 50 నిమిషాలు పడుతుంది. ఇ-స్కూటర్ ముందు, వెనుక రెండింటిలోనూ మోనోషాక్ సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ కాన్ఫిగరేషన్ ద్వారా బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు.