MG Cyberster: తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందండోయ్.. ఫీచర్లు సూపరో సూపరూ.. సింగిల్ ఛార్జ్‌పై 663 కిమీ..!

MG Cyberster: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ సైబర్‌స్టర్ బుకింగ్ ప్రారంభమైంది. వినియోగదారులు రూ.51,000 టోకెన్ మొత్తం చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

Update: 2025-04-07 09:22 GMT

MG Cyberster: తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందండోయ్.. ఫీచర్లు సూపరో సూపరూ.. సింగిల్ ఛార్జ్‌పై 663 కిమీ..!

MG Cyberster: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ సైబర్‌స్టర్ బుకింగ్ ప్రారంభమైంది. వినియోగదారులు రూ.51,000 టోకెన్ మొత్తం చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారును ఆటో ఎక్స్‌పో 2025లో మొదటిసారిగా పరిచయం చేశారు. ఇది భారతదేశపు మొట్టమొదటి స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కారు. దీన్ని భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కారు డిజైన్, డ్రైవింగ్ రేంజ్ కారణంగా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేగం, లగ్జరీని ఇష్టపడే వినియోగదారుల కోసం ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు. మీరు కూడా కొత్త ఎంజీ సైబర్‌స్టర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే.. రండి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుందాం.

MG Cyberster Range

ఎంజీ సైబర్‌స్టర్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇది ఎంజీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ కారు. కొత్త సైబర్‌స్టర్‌లో 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని భావిస్తున్నారు.

ఈ కారు సంభార్ సాల్ట్ లేక్ వద్ద కేవలం 3.2 సెకన్ల వ్యవధిలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకొని రికార్డు సృష్టించింది. ఈ ఈవీ 510 పిఎస్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు రోజువారీ వినియోగంతో పాటు దూర ప్రయాణాలకు కూడా ఉపయోగపడుతుంది. స్థలం గురించి మాట్లాడితే అందులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోగలరు.

MG Cyberster Price

ఎంజీ సైబర్‌స్టర్ అంచనా ధర రూ. 50 లక్షల ఎక్స్-షోరూమ్. ఈ కారు ఎంజీ ఎంపిక చేసిన అవుట్‌లెట్లలో విక్రయించనున్నారు. ధరకు సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు భారత్‌లో లాంచ్ అయినప్పుడు కస్టమర్లు దీన్ని ఎంతవరకు ఇష్టపడతారో చూడాలి. ఈ సంవత్సరం ఎంజీ ద్వారా అనేక కొత్త ఈవీ కార్లను విడుదల చేయబోతున్నారు. మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎంజీ ఈవీని ఉపయోగించవచ్చు.

Kia EV6

ఇటీవలే కియా ఈవీ6 ధర వెల్లడైంది. కొత్త కియా EV6 ఎస్‌యూవీలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు భద్రతా ఫీచర్లుగా అందించారు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 663 కిమీ (ARAI) రేంజ్‌ను అందిస్తుంది. ఈ వాహనం ధర రూ.65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

Tags:    

Similar News