Maruti Victoris: మారుతి సుజుకి విక్టోరిస్.. ధర భారీగా పెరిగింది..!
Maruti Victoris Price Hike: మారుతి సుజుకి విక్టోరిస్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ ధరల్లో మార్పులు చేసింది.
Maruti Victoris: మారుతి సుజుకి విక్టోరిస్.. ధర భారీగా పెరిగింది..!
Maruti Victoris Price Hike: మారుతి సుజుకి విక్టోరిస్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ ధరల్లో మార్పులు చేసింది.ఎంపిక చేసిన వేరియంట్ల ధర దాదాపు రూ.15,000కి పెరిగింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వస్తాయి. సెప్టెంబర్‌లో ప్రారంభించిన విక్టోరిస్ ధరలు రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ పెరుగుదల ZXi+(O) MT, ZXi+(O) 6AT వేరియంట్‌లతో సహా టాప్-స్పెక్ వేరియంట్ల ధరలను పెంచింది. విక్టోరిస్ మారుతి అరీనా లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్. ఇది ఆరు వేరియంట్‌లలో, 10 విభిన్న రంగు ఎంపికలలో లభిస్తుంది.
విక్టోరిస్ మూడు ఇంజన్ ఎంపికలతో అందిస్తున్నారు. మొదటిది 103 హార్స్ పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్, నాలుగు-సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్. రెండవది 116 హార్స్ పవర్‌తో 1.5-లీటర్, 3-సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, మూడవది 89 హార్స్ పవర్‌తో 1.5-లీటర్ పెట్రోల్-సీఎన్‌జీ. పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తోంది, అయితే స్ట్రాంగ్ హైబ్రిడ్ e-CVT గేర్‌బాక్స్‌తో అందించారు.
స్ట్రాంగ్ హైబ్రిడ్ (e-CVT) 28.65 కెఎమ్‌పిఎల్ మైలేజ్, పెట్రోల్ మాన్యువల్ 21.18 కెఎమ్‌పిఎల్ మైలేజ్, పెట్రోల్ ఆటోమేటిక్ 21.06 కెఎమ్‌పిఎల్ మైలేజ్, పెట్రోల్ AWD ఆటోమేటిక్ 19.07 కెఎమ్‌పిఎల్ మైలేజ్, సీఎన్‌జీ మాన్యువల్ 27.02 km/kg మైలేజ్ ఇస్తుంది.ఇది రాబోయే మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొందిన డిజైన్‌తో వస్తోంది.
ముందు భాగంలో, విక్టోరిస్‌లో క్రోమ్ స్ట్రిప్, మందపాటి ప్లాస్టిక్ క్లాడింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో పెద్ద LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ పిల్లర్లు, సిల్వర్ రూఫ్ రెయిల్స్, మరింత చతురస్రాకార బాడీ క్లాడింగ్ ఉన్నాయి. విక్టోరిస్ సెగ్మెంటెడ్ LED లైట్ బార్, వెనుక భాగంలో 'VICTORIS' లెటరింగ్ ఉంది.
డాష్‌బోర్డ్ పైన 10.25-అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంది, కుడి వైపున డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది. ఇందులో మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డాల్బీ అట్మాస్‌తో 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో వస్తోంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, లెథరెట్ అప్హోల్స్టరీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉన్నాయి.
ఈ కారు వైర్‌లెస్ ఛార్జర్, 8-వే ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, పవర్డ్ టెయిల్‌గేట్‌తో కూడా వస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, SOFIX చైల్డ్ సీట్ అడ్జస్ట్‌మెంట్‌లతో ప్రామాణికంగా వస్తుంది.
ఈ కారులో 360-డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. అలానే ADAS లెవల్ 2 టెక్నాలజీ, అనేక స్మార్ట్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ADASలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ ఉన్నాయి. దీనిలో బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ చేంజ్ అలర్ట్‌తో కూడా వస్తుంది. ఇది ఇండియా NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.