Maruti Suzuki Upcoming Electric SUVs: మారుతి సుజుకి నుంచి రానున్న ఎలక్ట్రిక్ కార్లు.. లేటుగా మొదలు పెట్టినా లేటెస్ట్ రికార్డులు సృష్టించేలా..!
Maruti Suzuki Upcoming Electric SUVs: భారత మార్కెట్లో అతిపెద్ద కంపెనీ మారుతి సుజుకి త్వరలో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. కంపెనీ టైమ్‌లైక్‌ను కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది.
Maruti Suzuki Upcoming Electric SUVs: మారుతి సుజుకి నుంచి రానున్న ఎలక్ట్రిక్ కార్లు.. లేటుగా మొదలు పెట్టినా లేటెస్ట్ రికార్డులు సృష్టించేలా..!
Maruti Suzuki Upcoming Electric SUVs: భారత మార్కెట్లో అతిపెద్ద కంపెనీ మారుతి సుజుకి త్వరలో తన తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. కంపెనీ టైమ్‌లైక్‌ను కూడా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది మాత్రమే కాదు, దీనిని నెక్సా షోరూమ్‌లలో కూడా విక్రయించనుంది. దీనితో పాటు, కంపెనీ 2025 సంవత్సరంలో మరో ఎస్యూవీ కారును విడుదల చేయాలని యోచిస్తోంది. మారుతి eVitara భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుంది. తదితర వివరాలు తెలుసుకుందాం.
ఇది కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, సెప్టెంబర్ 2025లో విడుదల కానుంది. కంపెనీ దీనిని నెక్సా అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయిస్తుంది. దీనితో పాటు, ఈ అవుట్‌లెట్‌లలో ఈ విటారాను కూడా ప్రదర్శించనుంది. భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ దీనిని ప్రదర్శించింది. భారతదేశంలో ప్రారంభించిన తర్వాత ఈ వాటారా, టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఏంజీ జేఎస్ ఈవీలతో పోటీపడుతుంది. దేశంలో మారుతి ఈవిటారా ఎక్స్-షోరూమ్ ధర రూ. 16 లక్షల నుండి రూ. 17 లక్షల మధ్య ఉండవచ్చు. విటారా కాకుండా, మారుతి సుజుకి 2025లో మరో ఎస్యువీని కూడా విడుదల చేస్తుంది. రెండో ఎస్యూవీ ఏమిటో, ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు, కానీ ఇది 2025 చివరి నాటికి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఎస్యూవీ గ్రాండ్ విటారా 7-సీటర్ వెర్షన్ కావచ్చు. భారతదేశ రోడ్లపై ఇప్పటికే చాలా సార్లు గుర్తించారు. దాని ముందు వెనుక డిజైన్‌లో గణనీయమైన మార్పులు ఉండవచ్చు, దీనికి కొత్త, విభిన్నమైన రూపాన్ని ఇవ్వచ్చు.
మారుతి సుజుకి దేశీయ మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్‌లో తన పట్టును బలోపేతం చేసుకోవాలని యోచిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ అమ్మకాలలో కంపెనీ కేవలం 2శాతం వృద్ధిని మాత్రమే సాధించింది, కాబట్టి ఇప్పుడు కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరంలో 20శాతం ఎగుమతి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో దాని సమగ్ర ప్రణాళికలతో 2025లో భారత మార్కెట్లో 50శాతం మార్కెట్ వాటాను తిరిగి పొందనుంది.