4Th Gen Swift Sport: స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్.. ఇంజన్ మామూలుగా లేదు..!
4Th Gen Swift Sport: సుజుకి ఇటీవల స్విఫ్ట్ స్పోర్ట్ ZC33S ఫైనల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ కారును మూడవ తరం స్విఫ్ట్ ఆధారంగా రూపొందించారు.
4Th Gen Swift Sport: స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్.. ఇంజన్ మామూలుగా లేదు..!
4Th Gen Swift Sport: సుజుకి ఇటీవల స్విఫ్ట్ స్పోర్ట్ ZC33S ఫైనల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ కారును మూడవ తరం స్విఫ్ట్ ఆధారంగా రూపొందించారు. దీని విక్రయాలు మార్చి 2025 నుండి ప్రారంభమవుతాయి, నవంబర్ 2025 వరకు కొనసాగుతాయి. సుజుకి నాల్గవ తరం స్విఫ్ట్ స్పోర్ట్‌ను 2026లో విడుదల చేయవచ్చని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి. స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ హై పర్ఫామెన్స్‌ను అందిస్తుంది. ఇందులో అనేక అదనపు ఫీచర్లను కూడా ఉన్నాయి. తాజాగా ఈ మోడల్ ఇంజన్ వివరాలు వెల్లడయ్యాయి.
4వ తరం స్విఫ్ట్ స్టాండర్డ్ మోడల్ ఇప్పుడు కొత్త 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని, 111.7ఎన్ఎమ్ లో-ఎండ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పోల్చి చూస్తే, కొత్త 2025 స్విఫ్ట్ స్పోర్ట్ 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది. అదే 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్-ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అలాగే ఉంది.
1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 పిఎస్ పవర్, 240 ఎప్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ డ్రైవ్ మోటార్ 15 పిఎస్ పవర్, 59 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ పవర్ 4వ-తరం స్విఫ్ట్ మోడల్ కంటే చాలా ఎక్కువ. ఇండియా-స్పెక్ కొత్త స్విఫ్ట్ 81.58 పిఎస్ పవర్ అవుట్‌పుట్‌ను రిలీజ్ చేస్తుంది. కొత్త 2025 స్విఫ్ట్ స్పోర్ట్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది.
కొత్త స్విఫ్ట్ స్పోర్ట్ 3,990 మిమీ పొడవు, 1,750 మిమీ వెడల్పు,1,500 మిమీ ఎత్తు ఉంటుంది. వీల్‌బేస్ 2,450మిమీ ఉంటుంది. పోల్చి చూస్తే ఇండియా-స్పెక్ 4వ-జెన్ స్విఫ్ట్ ప్రామాణిక మోడల్ 3,860మిమీ పొడవు, 1,735మిమీ వెడల్పు, 1,520మిమా ఎత్తు. వీల్‌బేస్ రెండు మోడళ్లకు సమానంగా ఉంటుంది. 2025 స్విఫ్ట్ స్పోర్ట్ , కర్బ్ వెయిట్ 960 కిలోలుగా ఉంటుందని కూడా వెల్లడించింది. మారుతి సుజుకి ప్రస్తుతం దేశంలో స్విఫ్ట్ స్పోర్ట్‌ను ప్రారంభించే ఆలోచన లేదు.