Maruti Suzuki Swift: రూ. 13 వేలకే మారుతి స్విఫ్ట్ కొత్త కారు.. ఎలానో తెలుసా?
Maruti Suzuki Swift: దేశీయ మార్కెట్లో మారుతి స్విఫ్ట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Maruti Suzuki Swift: రూ. 13 వేలకే మారుతి స్విఫ్ట్ కొత్త కారు.. ఎలానో తెలుసా?
Maruti Suzuki Swift: దేశీయ మార్కెట్లో మారుతి స్విఫ్ట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి సుజుకి ఇటీవల ఆటోమేటిక్ వేరియంట్ కార్ల ధరలను పెంచింది. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుండి రూ. 9.65 లక్షల మధ్య ఉంది. కొత్త మారుతి స్విఫ్ట్ అద్భుతమైన ఇంటీరియర్స్, స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీతో వస్తుంది. మీరు కూడా మారుతి సుజుకి స్విఫ్ట్‌ని కొనాలని చూస్తున్నట్లయితే ఈ హ్యాచ్‌బ్యాక్ ఆన్-రోడ్ ధర, డౌన్ పేమెంట్, ఈఎమ్ఐ లెక్కల గురించి వివరంగా తెలుసుకుందాం.
మారుతి స్విఫ్ట్ LXI, VXI, VXI (O), ZXI, ZXI Plus వంటి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రాజధాని ఢిల్లీలో ఈ కారు బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 7.29 లక్షలుగా ఉంది. ఇందులో రూ. 46 వేల RTO ఛార్జీ, రూ. 28 వేల బీమా, రూ. 2 వేలు అదనపు ఛార్జీ ఉన్నాయి.
ఈ హ్యాచ్‌బ్యాక్ కారును కొనడానికి మీరు రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 6.29 లక్షలపై కారు లోన్ తీసుకోవచ్చు. మీరు 9 శాతం వడ్డీ రేటుతో కారు లోన్ పొందారని అనుకుందాం, అప్పుడు మీరు 5 సంవత్సరాల పాటు సుమారు రూ. 13 వేల EMI చెల్లించాలి.
మారుతి స్విఫ్ట్‌ను కొనడానికి మీరు రూ. 6.29 లక్షల కారు రుణం తీసుకున్నారు. ఈ విధంగా, 60 నెలల్లో మీరు 9 శాతం వడ్డీ రేటుతో సుమారు రూ. 1.55 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి రూ.లక్ష డౌన్ పేమెంట్‌ను కలిపితే, ఈ కారు మీకు వడ్డీతో కలిపి మొత్తం రూ.8.83 లక్షలు అవుతుంది.
మారుతి స్విఫ్ట్ ఆన్-రోడ్ ధరలు నగరాలు లేదా డీలర్‌షిప్‌లను బట్టి మారవచ్చు. మీరు తీసుకొనే కారు లోన్‌పై వడ్డీ రేటు మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీకు మంచి క్రెడిట్ ఉంటే, కారు లోన్ పొందే అవకాశాలు సాధారణంగా 9-10 శాతం మధ్య ఉంటాయి.
మారుతి స్విఫ్ట్ ఒక ఎకనామిక్ కారు. స్విఫ్ట్ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్‌లలో లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ CNGతో 33 కిమీ/కిలో మైలేజీని ఇస్తుంది. మీ టేక్ హోమ్ శాలరీ 40-50 వేల మధ్య ఉన్నట్లయితే, మీరు స్విఫ్ట్ కారును సులభంగా కొనవచ్చు.