Maruti Suzuki: మారుతీ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కార్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. టాటా, ఎంజీ కామెట్‌కు బై బై చెప్పాల్సిందే
Maruti Suzuki: మారుతి సుజుకి ఇటీవల వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ SUV eVX ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రదర్శించింది.
Maruti Suzuki: మారుతీ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కార్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే.. టాటా, ఎంజీ కామెట్‌కు బై బై చెప్పాల్సిందే
Maruti Suzuki: మారుతి సుజుకి ఇటీవల వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో తన మొదటి ఎలక్ట్రిక్ SUV eVX ప్రొడక్షన్ వెర్షన్‌ను ప్రదర్శించింది. అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది దీపావళికి ముందు ఈ కారును అధికారికంగా భారతదేశంలో విడుదల చేయవచ్చు. నివేదికల ప్రకారం, మారుతి ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చు. అయితే చౌక ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌పై మారుతి కూడా కన్నేసింది అనే వార్తలు కూడా వస్తున్నాయి.
టాటా టియాగో EV, MG కామెట్ EV వాటి తక్కువ ధరల కారణంగా భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అందువల్ల, ఇండో-జపనీస్ కంపెనీ మారుతీ సుజుకి భారతీయ ప్రజలను దృష్టిలో ఉంచుకుని కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేయాలని యోచిస్తోంది. దీనిని 2026-27 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మారుతి కొత్త కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ EV కారు ఈ సంవత్సరం జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన eWX కాన్సెప్ట్ మోడల్‌పై ఆధారపడి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ కారు లాంచ్ తర్వాత టాటాకు పెను సవాలే ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. మారుతి సుజుకి ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును K-EV ఆర్కిటెక్చర్‌లో డిజైన్ చేసి అభివృద్ధి చేయగలదు.
ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీ, ధరల పరంగా Wagon-R EV విఫలమైన తర్వాత, మారుతి సుజుకి ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారుని K-EV ఆర్కిటెక్చర్‌లో డిజైన్ చేసి అభివృద్ధి చేయవచ్చు. అంతేకాకుండా, కాంపాక్ట్ EV స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ కూడా ఇందులో ఉపయోగించనుంచి. విడిభాగాల తయారీని స్థానికీకరించకుండా ధరలను తక్కువగా ఉంచడం కష్టమని మారుతీ సుజుకి భారతీయ మార్కెట్‌ను బాగా అర్థం చేసుకుంది. అందువల్ల భారత గడ్డపై ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు కంపెనీ రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
మారుతీ సుజుకి డెన్సో, తోషిబాతో సంయుక్త భాగస్వామ్యంతో హైబ్రిడ్ వాహనాల కోసం బ్యాటరీ ప్లాంట్‌ను నిర్మించబోతోంది. అదనంగా, ఎలక్ట్రిక్ కార్లలో మిగ్-సైజ్ బ్లేడ్ సెల్ బ్యాటరీల కోసం eVX BYDతో జతకట్టింది. మారుతి సుజుకి 2026-2027 నాటికి ఆరు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.