Maruthi Suzuki: మారుతీ సుజుకీ మైండ్‌ బ్లోయింగ్‌ ఆఫర్స్‌.. ఏకంగా ఈ కారుపై రూ.45,000 డిస్కౌంట్‌..

Maruthi Suzuki March Offers: భారతీయ దిగ్గజ కార్ల ఉత్పత్తి కంపెనీ మారుతీ సుజుకీ. ఇది మార్చి నెలకు సంబంధించి బంపర్‌ ఆఫర్స్‌ ప్రకటించింది. కార్లపై ఏకంగా రూ.45,000 వరకు తగ్గింపు చేసింది.

Update: 2025-03-20 15:00 GMT

Maruthi Suzuki March Offers: మారుతీ సుజుకీ కార్లు కొనాలనుకుంటున్న వారికి భారీ శుభవార్త చెప్పింది. మార్చి నెల ఆఫర్లలో భాగంగా ఏకంగా కార్లపై రూ.45,000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఈ భారీ డిస్కౌంట్‌ చాలామంది కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఆకర్షిస్తోంది. మారుతీ సుజుకీ ప్రధానంగా రూ.40,000 డిస్కౌంట్‌, బెనిఫిట్స్‌ అందిస్తోంది. ప్రధానంగా అల్టోకే 10, Sప్రెస్సో, స్వీఫ్ట్‌ కార్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇందులో క్యాష్‌ డిస్కౌంట్‌తోపాటు కార్పొరేట్‌ బెనిఫిట్స్‌ కూడా పొందుతారు. ఇక మీ పాతకారును ఎక్స్చేంజ్‌ చేస్తే మరిన్ని లాభాలు ఉంటాయి. అయితే, ఇది మీ ప్రాంతాలనుక బట్టి మారవచ్చు.

వేగన్‌ ఆర్‌..

మారుతీ సుజుకీ వేగన్‌ ఆర్‌పై రూ.35,000 క్యాష్‌ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఇది మ్యానువల్‌ పెట్రోల్‌ వెహికల్స్‌కు వర్తిస్తుంది. ఏఎంటీ, సీఎన్‌జీ వేరియంట్లపై ఏకంగా రూ.40,000, రూ.2,000 వరకు కార్పొరేట్‌ బెనిఫిట్స్‌ పొందుతారు. ఇక మీ పాత కారు 15 సంవత్సరాల కంటే పాతది ఎక్స్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.25,000 వరకు స్క్రాపింగ్‌ బెనిఫిట్‌ కూడా పొందుతారు.

మారుతీ స్విఫ్ట్‌..

మారుతీ స్విఫ్ట్‌ కారుపై మీరు ఏకంగా రూ.30,000 వరకు డిస్కౌంట్‌ పొందుతారు. ఇది కేవలం స్విఫ్ట్‌ LXi వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇతర వేరియంట్లపై దాదాపు రూ.25,000 వరకు పొందుతారు. దీంతోపాటు ఎక్స్చేంజ్‌ బోనస్‌ రూ.15,000. రూ.25,000 వరకు స్క్రాపింగ్‌ బెనిఫిట్స్‌ పొందుతారు.

అల్టో K10, ఎస్‌ప్రెస్సో, సిలేరియో..

మారుతీ సుజుకీ అల్టో కే10, ఎస్‌ప్రెస్సో, సిలేరియోపై కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మ్యానువల వేరియంట్‌పై రూ.40,000, ఏఎంటీ వేరియంట్‌పై రూ.45,000 వేలతోపాటు ఎక్స్చేంజ్‌ బోనస్‌, స్క్రాప్‌ బోనస్‌ కూడా పొందుతారు.

మారుతీ సుజుకీ Eeco..

ఈ కారుపై రూ.10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ ప్రకటించారు. ఇది పెట్రోల్‌ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇది కాకుండా మారుతీ సుజుకీ ఈకో స్క్రాప్‌ బెనిఫిట్‌ రూ.25,000, ఎక్స్చేంజ్‌ రూ.15,000 బోనస్‌ పొందుతారు. అయితే, మొదటిసారి కారు కొనుగోలు చేయనున్న టీవీలర్‌ కస్టమర్లకు కూడా కళ్లుచెరిరే బెనిఫిట్స్‌ పొందుతారు. హెల్మెట్‌ సీట్‌ బెల్ట్‌ ఆఫర్స్‌ కూడా ఉన్నాయి. అయితే, మారుతీ సుజుకీ డిజైర్‌, బ్రెజ్జా, ఎర్తీగాపై ఎలాంటి ఆఫర్లను ప్రకటించలేదు.

Tags:    

Similar News