Upcoming Maruti EV Cars: పెద్ద ప్లానే ఇది.. దుమ్మురేపే ఈవీలను లాంచ్ చేయనున్న మారుతి..!
Upcoming Maruti EV Cars: మారుతి సుజుకి ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తున్నట్లు ధృవీకరించింది.
Upcoming Maruti EV Cars: పెద్ద ప్లానే ఇది.. దుమ్మురేపే ఈవీలను లాంచ్ చేయనున్న మారుతి..!
Upcoming Maruti EV Cars: మారుతి సుజుకి ఎట్టకేలకు తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తున్నట్లు ధృవీకరించింది. గత నెలలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ఈ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇండియాలో మారుతి మొట్టమొదటి ఈవీ. దీని తర్వాత కంపెనీ మరో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో కొత్త సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి కంపెనీ ప్రస్తుతం పని చేస్తోంది.
అంతకంటే ముందు, ఈ ఎలక్ట్రిక్ కార్లన్నింటికీ పేరెంట్‌గా ఉన్న E-Vitara ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొదట దేశంలో విజయం సాధించాలి. కంపెనీ మొదటి ఈవీ వచ్చే నెలలో అమ్మకానికి రానుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది. అనేక ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది.
ఇప్పటికే మారుతి కొత్త ఎలక్ట్రిక్ కారుకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు డీలర్‌షిప్‌ల వద్ద కస్టమర్లను ఆకర్షిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హ్యాచ్‌బ్యాక్, 7-సీటర్ ఎంపీవీ కార్లను సరసమైన ధరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. రాబోయే రెండు కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ ఎంపీవీ
మారుతి సుజుకి దేశీయ మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని అభివృద్ధి చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరు 2026 నాటికి ఈ కారు మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. ఈ 7-సీటర్ ఎంపీవీని ఏడాదికి 50,000 నుండి 1 లక్ష యూనిట్లు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మారుతి సుజుకి ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎంపీవీ దేశీయ విపణిలో రాబోయే కియా కేరెన్స్ ఎలక్ట్రిక్ కారుకు పోటీగా ఉంటుంది.
మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్
ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లు ఎల్లప్పుడూ మారుతి సుజుకి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. రాబోయే ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2028 నాటికి ఉత్పత్తిలోకి వస్తుందని భావిస్తున్నారు. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 35 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
మారుతి సుజుకి ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ దేశీయ విపణిలో టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ వంటి వాటితో పోటీపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మారుతి దేశీయంగా రూపొందించిన, అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పోటీ ధరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.