Maruti Grand Vitara: షాక్.. గ్రాండ్ విటారా ధరను పెంచిన మారుతి
Maruti Grand Vitara: మారుతి సుజుకి ఫేమస్ హైబ్రిడ్ కార్ గ్రాండ్ విటారా ధరను పెంచింది. ఈ ఎస్‌యూవీ ధర ఇప్పటికే దాదాపు రూ.20 వేలు పెరిగింది.
Maruti Grand Vitara: మారుతి సుజుకి ఫేమస్ హైబ్రిడ్ కార్ గ్రాండ్ విటారా ధరను పెంచింది. ఈ ఎస్‌యూవీ ధర ఇప్పటికే దాదాపు రూ.20 వేలు పెరిగింది. ఈ విటారా హైబ్రిడ్ ఇంజన్ మంచి మైలేజీతో వస్తుంది. ఇందులో ప్రయాణికుల భద్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. మారుతి గ్రాండ్ విటారా కొత్త ధర, స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రాండ్ విటారా సిగ్మా, డెల్టా, జెటా, జెటా ప్లస్, ఆల్ఫా వంటి అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. స్మార్ట్ హైబ్రిడ్‌తో వస్తున్న ఆ కారు బేస్ సిగ్మా వేరియంట్ ధర రూ. 20 వేలు పెరిగింది. ధర పెరుగుదల తర్వాత మారుతి గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 11.19 లక్షల నుండి రూ. 19.99 లక్షల మధ్య ఉంటుంది.
మారుతి గ్రాండ్ విటారా ఆకర్షణీయమైన డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో వస్తుంది. నెక్సా బ్లూ, ఓపులెంట్ రెడ్, గ్రాండ్యుర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ 5-సీటర్ హైబ్రిడ్ SUV కారులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి. ఇవేకాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, హెడ్ అప్ డిస్‌ప్లే ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రయాణీకుల భద్రత కోసం.. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.
మారుతి గ్రాండ్ విటారాలో హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్), CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్లు ఉన్నాయి. CNG వేరియంట్‌లో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్ కూడా అందించారు.
గ్రాండ్ విటారా 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, e-CVT ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ 19 నుండి 27KMPL వరకు మైలేజీని ఇవ్వగలదు. CNG మోడల్ కారు 26.6 km/kg వరకు మైలేజీని అందిస్తుంది.
దేశీయ మార్కెట్లో మారుతి గ్రాండ్ విటారా హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, కియా సెల్టోస్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, టయోటా హైరైడర్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వంటి SUV కార్లతో పోటీపడుతుంది.