Maruti Suzuki Ertiga: లాంగ్ జర్నీ వెళ్లాలని ఉందా?.. అయితే 7 సీట్లతో మంచి కారు.. ఎర్టిగా ఆధిపత్యం తగ్గేలా లేదు..!
Maruti Suzuki Ertiga: భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా ఆధిపత్యం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
Maruti Suzuki Ertiga: లాంగ్ జర్నీ వెళ్లాలని ఉందా?.. అయితే 7 సీట్లతో మంచి కారు.. ఎర్టిగా ఆధిపత్యం తగ్గేలా లేదు..!
Maruti Suzuki Ertiga: భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా ఆధిపత్యం తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోసారి దీనిని నిరూపిస్తూ, 2025 మొదటి అర్ధభాగంలో అంటే జనవరి నుండి జూన్ మధ్య 7-సీట్ల విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ కాలంలో మారుతి సుజుకి ఎర్టిగా మొత్తం 91,991 యూనిట్లను విక్రయించింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో, మారుతి ఎర్టిగా మొత్తం 88,378 మంది కస్టమర్లను పొందింది. మారుతి సుజుకి ఎర్టిగా ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెెలుసుకుందాం.
Maruti Suzuki Ertiga Powertrain
మారుతి సుజుకి ఎర్టిగా 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 136.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మారుతి ఎర్టిగా పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లో 20.51కెెఎమ్‌పిఎల్ మైలేజీని, పెట్రోల్ ఆటోమేటిక్‌లో 20.3కెఎమ్‌పిఎల్, సిఎన్‌జి పవర్‌ట్రెయిన్‌తో 26.1కెఎమ్‌పిఎల్ మైలేజీని అందిస్తుంది. దీనితో పాటు, కస్టమర్లు ఎర్టిగాలో సిఎన్‌జి పవర్‌ట్రెయిన్ ఎంపికను కూడా పొందుతారు.
Maruti Suzuki Ertiga Price
కారు లోపలి భాగం గురించి మాట్లాడుకుంటే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ఆటో ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు, భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీ, బ్రేక్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా కారులో ఉన్నాయి. మారుతి ఎర్టిగా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ. 8.69 లక్షల నుండి రూ. 13.26 లక్షల వరకు ఉంటుంది.